అక్కినేని కుటుంబానికి అల్లు వారు పెద్ద సాయమే చేసి పెట్టారు ఒకప్పుడు. నాగచైతన్య కెరీర్ ఆరంభంలో నత్తనడకన సాగుతున్న సమయంలో అతడితో సుకుమార్ దర్శకత్వంలో ‘100 పర్సంట్ లవ్’ సినిమాను నిర్మించింది అల్లు అరవిందే. ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్టే అయింది. చైతూకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.
ఇప్పుడు చైతూను మించి ఇబ్బంది పడుతున్న అఖిల్‌ను అరవింద్ తన చేతుల్లోకి తీసుకున్నారు. వరుసగా మూడు ఫ్లాపులతో అల్లాడిపోయిన నాగ్ చిన్న కొడుకును హీరోగా పెట్టి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాను నిర్మిస్తున్నాడు అరవింద్.
పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్ని ఈ సినిమాకు కథానాయికగా తీసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ ఎంపిక చేసిన కథ అంటే కచ్చితంగా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం నాగార్జునలోనూ ఉంది.
ఇలా ఇద్దరు కొడుకుల్ని పెట్టి సినిమాలు తీసిన అరవింద్ కోసం నాగ్ కూడా తన వంతు సాయం చేయబోతున్నాడు. అరవింద్ ఆరంభించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ కొన్ని వెబ్ సిరీస్‌లు చేసి పెట్టనుందట. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అన్నాక కేవలం సినిమాలతో సరిపెడితే సరిపోదు.
ఒరిజినల్ కంటెంట్ ఉండాలి. ఇప్పటికే కొన్ని సిరీస్‌లను రూపొందించారు.. కంటెంట్ ఇంకా చాలా అవసరం ఉంది. అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఐతే అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున ఏర్పాటైన ఫిలిం స్కూల్‌లో చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్నారు.
వీరి సాయంతో తక్కువ బడ్జెట్లో కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేసి ‘ఆహా’కు ఇవ్వాలని నాగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ప్రియదర్శి ప్రధాన పాత్రలో ‘లూజర్’ అనే సిరీస్‌ను జీ5 కోసం చేసి పెట్టింది నాగ్ స్టూడియో. అలాగే అరవింద్ కోసం కొన్ని సిరీస్‌లు చేసి ఆయన రుణం తీర్చుకోవాలని చూస్తున్నాడు నాగ్.
This post was last modified on May 13, 2020 9:08 am
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
తెలంగాణ పల్లె గీతాలకు ఆణిముత్యమైన జానపద గాయకుడు మొగిలయ్య ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…