వకీల్ సాబ్ సినిమాను ఇరుకున పెట్టడానికి ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు, మంత్రులు గట్టి ప్రయత్నమే చేశారు. ఎన్నడూ లేని విధంగా ఉన్నట్లుండి ఏపీలో టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకొచ్చారు. బెనిఫిట్ షోలు, అదనపు షోలు రద్దుచేయడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ.. టికెట్ల రేట్ల గురించి ఉన్నట్లుండి ఎక్కడలేని పట్టుదల చూపించడం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటిదాకా చాలా సినిమాలకు తొలి వారం రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వగా.. ఉన్నట్లుండి వకీల్ సాబ్‌కు ఆ విషయంలో మొండిచేయి చూపించారు. అంతే కాక చాలా ఏళ్ల కిందటి రేట్ల కార్డుల్ని బయటికి తీసి వాటినే అమలు చేయాలనడంలో ఎగ్జిబిటర్లకు ఏమీ పాలు పోలేదు.
ఐతే పవన్‌ను ఇరుకున పెట్టాలని చూశారు కానీ.. మధ్యలో దెబ్బ తినేది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అనే విషయం మరిచారు. ఓ మంత్రి పనిగట్టుకుని ప్రెస్ మీట్లో, మరో మంత్రి ఓ రాజకీయ సభలో వకీల్ సాబ్ టికెట్ల వ్యవహారం గురించి మాట్లాడటం గమనార్హం.
ఐతే వకీల్ సాబ్ సినిమాకు నష్టం చేయడానికి ఏపీ అధికార పార్టీ గట్టిగానే ప్రయత్నించింది కానీ.. వాళ్ల లక్ష్యం నెరవేరినట్లయితే కనిపించడం లేదు. తక్కువ రేట్లతోనే వకీల్ సాబ్ భారీ వసూళ్లు రాబట్టింది ఆంధ్రా, రాయలసీమ ప్రాంతంలో. వీకెండ్, వీక్ డేస్ అని తేడా లేకుండా వకీల్ సాబ్‌కు ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వసూళ్లు వస్తున్నాయి.
మామూలుగా కొత్త సినిమా రిలీజైతే హీరో సహా టీం అంతా రంగంలోకి దిగి ప్రమోషన్లు చేస్తుంది. కానీ వకీల్ సాబ్ విషయంలో అలా జరగలేదు. పవన్ ఎప్పుడూ తన సినిమాలను ప్రమోట్ చేయడు. మిగతా టీం నుంచి కూడా పెద్దగా ప్రమోషన్లు లేవు. కానీ టికెట్ల గొడవ పుణ్యమా అని ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. కొంతమేర సానుభూతి కూడా వర్కవుటైంది. కాబట్టే వసూళ్లు అంచనాలను మించి పోతున్నట్లున్నాయి. వీక్ డేస్‌లోనూ ప్యాక్డ్ హౌస్‌లతో నడుస్తున్న వకీల్ సాబ్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా సాగుతోంది.
This post was last modified on April 15, 2021 1:14 pm
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…