పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బౌండరీల అవతల కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. కర్ణాటకలో పవన్ సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. అంతకుమించి వసూళ్లు వచ్చే ఏరియా యుఎస్. పవన్ సినిమాలకు ఓ మోస్తరు టాక్ వస్తే చాలు మిలియన్ డాలర్ వసూళ్లన్నవి కేక్ వాక్ అన్నట్లే. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ అక్కడ ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ క్లబ్బులో అడుగు పెట్టడం గమనార్హం.
తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 3 మిలియన్ డాలర్లు అలవోకగా కొట్టేస్తాడనే పేరుండేది పవన్‌కు. ఐతే కరోనా తర్వాత యుఎస్ మార్కెట్ దెబ్బ తిన్న మాట వాస్తవం. దేశీయ మార్కెట్‌తో పోలిస్తే అది పుంజుకోవడం కష్టమైంది. ఐతే ‘జాతిరత్నాలు’ సినిమాతో అక్కడ కూడా ఊపొచ్చింది. ఆ చిత్రం అనూహ్యంగా మిలియన్ డాలర్ క్లబ్బులోకి చేరింది. దీంతో యుఎస్‌లో తెలుగు సినిమాల మార్కెట్ పూర్వ వైభవం సంతరించుకోబోతున్నట్లే అనిపించింది.
‘వకీల్ సాబ్’కు మంచి టాక్ వస్తే 1.5 మిలియన్ డాలర్లు అలవోకగా కొట్టేస్తుందన్న అంచనాలు కలిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి మంచి రేటు పెట్టారు అక్కడి బయ్యర్లు. 1.3 మిలియన్ డాలర్లు సాధిస్తే అక్కడ బ్రేక్ ఈవెన్ అన్నట్లు. ఇదేమంత కష్ట సాధ్యంగా అనిపించలేదు. ప్రి సేల్స్ జోరుగా సాగడంతో సానుకూల దృక్పథంతో ఉన్నారంతా. కానీ ప్రిమియర్లతో 3 లక్షల డాలర్లు వసూలు చేసిన ‘వకీల్ సాబ్’.. ఆ తర్వాత అనుకున్నంత జోరు చూపించలేకపోయింది.
శనివారానికి హాఫ్ మిలియన్ క్లబ్బులో అడుగు పెట్టిన ‘వకీల్ సాబ్’ సోమవారానికి 6 లక్షల మార్కును టచ్ చేయగలిగింది. వీకెండ్ తర్వాత సినిమా అనుకున్నంతగా ఊపు చూపించట్లేదు. మంచి టాక్ వచ్చినప్పటికీ ‘వకీల్ సాబ్’ను చూసేందుకు యుఎస్ ప్రేక్షకులు మరీ ఆసక్తితో ఏమీ లేరని స్పష్టమవుతోంది. ఈ మాత్రం టాక్ తెచ్చుకున్న సినిమాకు వీకెండ్లో ఈజీగా మిలియన్ డాలర్లు వచ్చేయాలి. కానీ అలా జరగలేదు. మున్ముందు కూడా సినిమా పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. రీమేక్ మూవీ కావడం వల్లో, కరోనా భయాల వల్లో ఈ సినిమాకు ఆశించిన వసూళ్లు రావట్లేదని భావిస్తున్నారు. యుఎస్‌లో ఈ చిత్రం లాస్ వెంచర్ అయ్యేలాగే ఉంది.
This post was last modified on April 14, 2021 12:23 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…