2020.. అన్ని రంగాలనూ ఇబ్బందుల్లోకి నెట్టిన సంవత్సరం. సినీ పరిశ్రమ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. మిగతా రంగాలతో పోలిస్తే ఇది దారుణంగా దెబ్బతింది. ఇండస్ట్రీ మనుగడకు ప్రాణాధారమైన థియేటర్ల వ్యవస్థ ఆరేడు నెలల పాటు మూత పడితే ఆ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పేదేముంది? అందులోనూ సినిమాలకు భారీ వసూళ్లు వచ్చే వేసవిని కరోనా కమ్మేయడంతో నిరుడు సినీ పరిశ్రమ దిక్కు తోచని స్థితిలో పడింది.
ఐతే ఈ ప్రభావం నుంచి మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ కొంచెం త్వరగానే కోలుకుంది. పోస్ట్ కరోనా ఎరాలో మన దగ్గర సినిమాలు అంచనాలను మించి ఆడేశాయి. 100 శాతం ఆక్యుపెన్సీ కూడా వచ్చేయడంతో ఇక పరిశ్రమ కష్టాలన్నీ తొలగినట్లే అనుకున్నారు. ఇకపై ఎఫ్పుడూ కరోనా టైంలో ఎదురైన కష్టం ఉండదనే అనుకున్నారు. కానీ గత కొన్ని రోజుల్లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి.
కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా మళ్లీ షరతులు తప్పట్లేదు. ఆ ప్రభావం థియేటర్ల మీద బాగా పడుతోంది. అన్ని చోట్లా ఆక్యుపెన్సీని 50 శాతానికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లను పూర్తిగా మూసి వేయక తప్పని పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడకపోవచ్చు కానీ.. 50 శాతం ఆక్యుపెన్సీ పరిమితి అనివార్యం అయ్యేలా ఉంది. దీనికి తోడు ఏపీలో టికెట్ల రేట్లపై ఉన్నట్లుండి నియంత్రణ మొదలవడంతో కొత్త సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ఇప్పటికే లవ్ స్టోరి, టక్ జగదీష్ వాయిదా పడ్డాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగు పడేలా లేకపోవడంతో తర్వాతి వారాల్లో రావాల్సిన విరాటపర్వం, ఆచార్య, నారప్ప సినిమాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. వాటిని కూడా వాయిదా వేయడం లాంఛనమే అంటున్నారు. మొత్తంగా చూస్తే ‘వకీల్ సాబ్’తో వేసవికి అదిరే ఆరంభం లభించినా.. ఈ క్రేజీ సీజన్‌కు ఉన్నట్లుండి బ్రేక్ పడిపోయింది. 2020 లాగే 2021 కూడా వెలవెలబోయేట్లే కనిపిస్తోంది. కాకపోతే గత ఏడాదిలా పూర్తిగా సినిమాల్లేని పరిస్థితి ఉండదు కానీ.. ఎప్పుడూ వేసవిలో ఉండే హంగామా మాత్రం ఈసారి కష్టమే.
This post was last modified on April 14, 2021 11:22 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…