నేచురల్ స్టార్ నాని తన 25వ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. అతను విలన్ పాత్రలో నటించిన ఆ సినిమా ‘వి’. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఉగాదికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. థియేటర్లు మూత పడటంతో వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో.. ఈ సినిమాను ఏ సమయంలో రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు. ఈ సినిమాను పూర్తి చేసిన వెంటనే నాని.. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమాను మొదలుపెట్టి కొంత మేర చిత్రీకరణలోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. మళ్లీ షూటింగ్‌లు ఆరంభం కాగానే నాని ఈ చిత్రాన్ని పున:ప్రారంభించనున్నాడు.
ఇప్పుడు ఖాళీ దొరకడంతో తన తర్వాతి సినిమా విషయంలోనూ నాని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్న వివేక్ ఆత్రేయతోనే తన 27వ సినిమాను అతను చేయబోతున్నాడు.
‘మెంటల్ మదిలో’తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన వివేక్ ఆత్రేయ ఆ సినిమాతో కమర్షియల్‌గా ఆశించిన మేర విజయాన్నందుకోలేకపోయాడు. కానీ తర్వాతి సినిమా ‘బ్రోచేవారెవరురా’ మాత్రం సూపర్ హిట్టయింది. దీంతో కమర్షియల్‌గానూ ఇతను సినిమాను వర్కవుట్ చేయగలడన్న గురి కుదిరింది.
దీంతో నాని అతడికి అవకాశం ఇచ్చాడు. నానితో ఇంతకుముందు ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినమాను ప్రొడ్యూస్ చేయనుంది. ఇటీవలే హీరో, దర్శకుడు, నిర్మాతల మధ్య అంగీకారం కుదిరింది. స్క్రిప్టు కూడా ఓకే అయింది.
వీరి కలయికలో రాబోతున్న సినిమా కామెడీ థ్రిల్లర్ అని అంటున్నారు. లాక్ డౌన్ టైంలో పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని.. షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది.
This post was last modified on May 12, 2020 2:56 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…