పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ ఏంటో సోషల్ మీడియా మరోసారి చూసింది. పవన్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన గబ్బర్ సింగ్ సినిమా విడుదలై 8 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిన్నట్నుంచి ట్విట్టర్లో పవన్ అభిమానుల సందడి మామూలుగా లేదు. ట్విట్టర్లో మూవీ ట్రెండ్స్‌కు సంబంధించి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పవర్ స్టార్ ఫ్యాన్స్.. అనుకున్నది చేసి చూపించారు.
ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుపెడితే.. సోమవారం సాయంత్రం 6 గంటల్లోపు.. అంటే 24 గంటల వ్యవధిలో ఏకంగా గబ్బర్ సింగ్ హ్యాష్ ట్యాగ్ మీద కోటి 38 లక్షల ట్వీట్లు వేశారు. టాలీవుడ్లోనే కాదు.. ఇండియా మొత్తంలో లార్జెస్ట్ మూవీ ట్రెండ్ ఇదే కావడం విశేషం.
ఇప్పటిదాకా 10 మిలియన్ల మార్కును కూడా ఎవరూ అందుకోక పోగా.. పవన్ ఫ్యాన్స్ ఏకంగా 13.8 మిలియన్లతో సరికొత్త రికార్డు నెలకొల్పారు. హీరోల ఫ్యాన్స్‌కు ఇలా ట్రెండ్స్‌లో రికార్డులు నమోదు చేయడం ఈ మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. ఐతే ఇలాంటి రికార్డుల్లో చాలా వరకు హీరోల సపోర్టుతో నడిచే ఫ్యాన్ గ్రూపులు, పీఓర్వోల పాత్ర చాలా ఉంటోంది. ఫేక్ ఐడీల కోసం బోట్స్ కొని ట్వీట్లు వేయించడం మామూలైపోయింది.
ఐతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషయంలో ఇలాంటి వాటికి ఆస్కారమే లేదు. ఆయన తన సినిమాల ఊసే ఎత్తడు. ఇందుకోసం ఆయన పీఆర్వోలనూ పెట్టుకోలేదు. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం వీళ్లను బాగా ప్రోత్సహించారు.కేవలం అభిమానులే పంతం పట్టారు. తమ అభిమానాన్నంతా తెచ్చి ట్వీట్ల రూపంలో పోసేశారు. దీంతో కనీ వినీ ఎరుగని రికార్డు నమోదైంది.
This post was last modified on May 12, 2020 12:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…