మిళ, మలయాళ సినిమాల్లో హీరోలు పంచె కట్టులో కనిపించడం మామూలే. సినిమా అంతా కూడా హీరో పంచె కట్టులోనే కనిపించే సినిమాలు చాలానే కనిపిస్తాయి. కానీ మన దగ్గరా పంచె కట్టు సంప్రదాయం ఉన్నప్పటికీ మన హీరోలు మాత్రం ఆ లుక్‌లో కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు. తమిళంలో హీరో పంచెకట్టులో కనిపించిన సినిమాను రీమేక్ చేస్తూ కూడా తెలుగులో వచ్చేసరికి హీరోకు ప్యాంటే తొడిగిస్తుంటారు.
కానీ ఇప్పుడో రీమేక్ విషయంలో మాత్రం హీరోను పూర్తిగా పంచెకట్టులోనే చూపించబోతున్నారట. ఆ హీరో మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. ఆయన కథానాయకుడిగా మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో హీరో మోహన్ లాల్ పూర్తిగా పంచెకట్టులోనే కనిపిస్తాడు. ఒక్కసారి కూడా ప్యాంటు తొడగడు.
రాజకీయాలతో టచ్ ఉన్న సినిమా కావడంతో హీరోను పంచెలో చూపిస్తే బాగుంటుందని దర్శకుడు మోహన్ రాజా భావించాడట. చిరుకు చెబితే అందుకు ఆయన కూడా అంగీకరించారట. కాబట్టి సినిమా మొత్తం చిరు పంచెకట్టులోనే కనిపిస్తాడని, అభిమానులకు ఇది ట్రీటే అని అంటున్నారు. ఇక ఈ సినిమాకు ‘కింగ్ మేకర్’ అని, ‘అన్న’ టైటిళ్లు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇంకొన్ని రోజుల్లోనే ‘ఆచార్య’ను పూర్తి చేసి ఈ సినిమా మీదికి వెళ్లిపోనున్నాడు చిరు. సూపర్ గుడ్ ఫిలిమ్స్‌తో కలిసి చిరు సొంతం సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న తమన్‌తోనే ఈ చిత్రానికి మ్యూజిక్ చేయించుకోనున్నారు. ఈ సినిమాలో చిరుకు హీరోయిన్ ఉండదు. హీరో కజిన్‌గా ఒక లేడీ క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. ఆ పాత్ర ఎవరు చేస్తున్నారో వెల్లడి కాలేదు.
This post was last modified on April 11, 2021 2:52 pm
టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్…
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తో తన కంబ్యాక్ ఇస్తానని అభిమానులను ఊరిస్తున్న దర్శకుడు శంకర్ దానికి తగ్గట్టే ట్రైలర్ ద్వారా…
కొన్నిసార్లు సినిమాల పరంగా జరిగే సంఘటనలు యాదృచ్చికమే అయినా విచిత్రంగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది కూడా. జనవరి 10 విడుదల…
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు వృత్తి అవకాశాల కోసం ఓపీటీపై చాలా ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ వీసాలు పొందేందుకు ఈ…
టాలీవుడ్లో పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వారసులకు కూడా లేని అరంగేట్రం బెల్లకొండ సాయి శ్రీనివాస్కు దక్కింది. బెల్లంకొండ సురేష్…
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ నేతల మధ్య మాటల…