అక్కినేని అఖిల్ అరంగేట్రానికి ముందు అతడిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. నాగచైతన్య సంపాదించుకోలేకపోయిన మాస్ ఇమేజ్‌ను అఖిల సంపాదించుకుంటాడని, తొలి సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోతాడని అక్కినేని అభిమానులు అంచనా వేశారు. ‘అఖిల్’ సినిమాకు వచ్చిన హైప్ చూస్తే ఆ ఆశలు ఫలించేలాగే కనిపించాయి. కానీ ‘అఖిల్’ అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను అఖిల్‌ను ఇంకా కిందికి లాగేశాయి. సినిమా సినిమాకూ పైకి వెళ్లాల్సిన గ్రాఫ్ కాస్తా కిందికి వెళ్లింది. అక్కినేని హీరో కెరీర్ ఇలా తిరోగమనంలో పయనిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు అఖిల్ నుంచి వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద కూడా పెద్దగా అంచనాల్లేవు. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి అఖిల్ తొలి సక్సెస్ రుచి చూస్తే చాలని మాత్రమే అభిమానులు ఆశిస్తున్నారు.
ఐతే అఖిల్ ఐదో సినిమా విషయంలో మాత్రం అభిమానుల అంచనాలే వేరుగా ఉన్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ను లైట్ తీసుకుని, దాని విషయంలో పెద్దగా హడావుడి చేయని అక్కినేని అభిమానులు.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా అనౌన్స్ అయిన ‘ఏజెంట్’ విషయంలో మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు. కొన్నేళ్లుగా అక్కినేని ఫ్యామిలీలో మాస్ హిట్ లేక స్తబ్దుగా ఉన్న అభిమానులు ‘ఏజెంట్’ సినిమాకు వచ్చేసరికి ఎక్కడలేని ఎగ్జైట్మెంట్ తెచ్చుకుంటున్నారు. వాళ్లు మళ్లీ యునైట్ అవుతున్నారు. ఈ సినిమా మాస్ హిట్టవుతుందని.. అఖిల్ ఇమేజ్‌ను మార్చేస్తుందని, అతడి కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని వాళ్లు ఆశతో ఉన్నారు.
ఈ సినిమాకు హైప్ రావడానికి ప్రధాన కారణం అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండటం, వక్కంతం వంశీ కథ అందించడం. అనిల్ సుంకర ఏకంగా 50 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యాడంటే ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఫస్ట్ లుక్ లాంచ్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యాన్స్ హడావుడి చూస్తే అఖిల్ కెరీర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్లే ఉంది.
This post was last modified on April 9, 2021 5:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…