పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ సందడి ఇంకో రెండు రోజుల్లోనే మొదలు కాబోతోంది. మూడేళ్లకు పైగా విరామం తర్వాత పవన్ సినిమా రిలీజవుతుండటంతో అభిమానులు మామూలు ఆకలితో లేరు. తమ ఆరాధ్య నటుడిని వెండి తెరపై చూసేందుకు తహతహలాడిపోతున్నారు. కొన్ని రోజుల కిందట ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రిలీజ్‌కే ఎంత హంగామా నడిచిందో తెలిసిందే.
ఇక థియేటర్లలో ఫుల్ సినిమా పడితే వాళ్ల ఆనందానికి అవధులుండవు. అందరి కంటే ముందు, సాధ్యమైనంత త్వరగా పవన్ సినిమా చూడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కాచుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ‘వకీల్ సాబ్’ను ఓవర్సీస్‌లోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. విదేశాల్లో మాత్రమే ఈ చిత్రం 700 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం. ఒక్క యుఎస్‌లోనే స్క్రీన్ కౌంట్ 285 కావడం గమనార్హం. కొవిడ్ బ్రేక్ తర్వాత ఏ ఇండియన్ సినిమా కూడా ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ కాలేదు.
యుఎస్‌లో ‘వకీల్ సాబ్’ ప్రి సేల్స్ చూస్తుంటేనే.. అక్కడ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. వారం కిందటే ప్రిమియర్ షోలకు ప్రి సేల్స్ మొదలుపెట్టగా.. అప్పుడే అవి లక్ష డాలర్ల మార్కును దాటేశాయి. బుధవారం రాత్రికి ప్రి సేల్స్ 2 లక్షల డాలర్ల మార్కును అందుకుంటాయని భావిస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే.. ‘వకీల్ సాబ్’ యుఎస్‌లో ప్రిమియర్లతోనే హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరిపోతుందని అంచనా వేస్తున్నారు. టాక్ ఎలా ఉన్నా సరే.. వీకెండ్లో మిలియన్ క్లబ్బులో చేరడమూ లాంఛనమే అని భావిస్తున్నారు.
కరోనా విరామం తర్వాత అక్కడ ఇండియన్ సినిమాల్లో మిలియన్ మార్కును అందుకున్న తొలి చిత్రంగా ‘జాతిరత్నాలు’ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. పవన్ సినిమా వీకెండ్లోనే ఆ సినిమా వసూళ్ల రికార్డును దాటడం ఖాయం. ఒకప్పుడు పవన్ సినిమాకు మంచి టాక్ వస్తే వీకెండ్లోనే 2 మిలియన్ డాలర్లు వచ్చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. పాజిటివ్ టాక్ వస్తే ఫుల్ రన్లో 2 మిలియన్ గ్యారెంటీ అనుకోవచ్చు. మరోవైపు ఆస్ట్రేలియాలో సైతం ‘వకీల్ సాబ్’ భారీ స్థాయిలో రిలీజవుతోంది. అక్కడ కూడా అప్పుడే ప్రి సేల్స్ లక్ష డాలర్లను దాటిపోయాయి. అక్కడ ఫుల్ రన్లో హాఫ్ మిలియన్ గ్యారెంటీ అంటున్నారు.
This post was last modified on April 7, 2021 2:56 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…