‘‘మంచి సినిమా తీశాం’’.. ‘‘ఇందులో మంచి సందేశం ఉంది’’.. ‘‘ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది’’.. దర్శక నిర్మాతలు, హీరోల నోటి నుంచి తరచుగా వినిపించే మాటలు ఇవి. ఇలాంటి మాటలు ఒకప్పుడు సినిమాలకు మంచి చేసేవి కానీ.. ఇప్పుడు మాత్రం ఇవే ప్రతికూలంగా మారిపోతున్నాయి. ‘మంచి సినిమా’ అనే ట్యాగ్ వేసుకుంటే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఇందుకు గత నెలలో వచ్చిన ‘శ్రీకారం’.. ఈ నెలలో విడుదలైన ‘వైల్డ్ డాగ్’ సినిమాలే ఉదాహరణ.
‘శ్రీకారం’ వ్యవసాయం నేపథ్యంలో, రైతుల సమస్యల గురించి చర్చించిన చిత్రం. అందులో మంచి సందేశం ఉంది. కొంచెం కమర్షియల్ టచ్ ఇస్తూనే ఆలోచింపజేసేలా ఈ సినిమా తీశారు. దర్శకుడు కిషోర్ కొత్తవాడైనప్పటికీ ఉన్నంతలో సినిమాను బాగానే డీల్ చేశాడు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. అందరూ మంచి సినిమా అనే అన్నారు. కానీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లలేదు.
దీనికి పోటీగా విడుదలైన ‘జాతిరత్నాలు’లో ‘మంచి’ అంటూ ఏమీ ఉండదు. అల్లరల్లరిగా సాగుతుందా చిత్రం. దానికే ప్రేక్షకులు పట్టం కట్టారు. మాకు సందేశాలు అవసరం లేదు, వినోదం చాలు అన్న సంకేతాల్ని ప్రేక్షకులు ఇచ్చారు.
గత వారాంతంలో విడుదలైన ‘వైల్డ్ డాగ్’ను చూసిన వాళ్లందరూ కూడా ఇది ‘మంచి సినిమా’ అనే అన్నారు. ఉగ్రవాదుల ఆట కట్టించేందుకు ఇండియాలో జరిగిన అతి పెద్ద ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. జనాలను ఎంతో ఇన్‌స్పైర్ చేసే, భావోద్వేగాలు రేకెత్తించే కథాంశంతో తెరకెక్కిన సినిమా అయినా.. దీనికి బాక్సాఫీస్ దగ్గర ప్రతికూల ఫలితమే ఎదురైంది.
నాగ్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా అయినప్పటికీ చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. మంచి సినిమా.. అందరూ చూడాల్సిన సినిమా అంటూ చిరంజీవి సైతం ప్రేక్షకులకు పిలుపునిచ్చాడు. కానీ వాళ్లు పట్టించుకోలేదు. వినోద ప్రధానంగా, లేదంటే ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు ఈ రోజుల్లో థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మంచి సినిమా’ అనే ట్యాగ్ ప్రమాదకరంగా మారుతోందన్నది స్పష్టం.
This post was last modified on April 7, 2021 2:57 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…