వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. సంచలనాల్ని ఇంటి పేరుగా మార్చుకున్న నటి కమ్ మోడల్ పూనమ్ పాండే ను ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమాల కంటే కూడా సంచలనాలతో కనిపించే పూనమ్.. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. తొలుత అదుపులోకి తీసుకున్నప్పటికి.. అనంతరం ఆమెను.. ఆమె బాయ్ ఫ్రెండ్ ను విడిచిపెట్టారు. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతున్న సంగతి తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకూ లాక్ డౌన్ నిబంధనల్ని కాస్త సడలించినా.. సాయంత్రం ఆరు గంటల తర్వాత నుంచి రాకపోకలపై ఆంక్షల్ని విధించారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో బీఎండబ్ల్యూ కారులో తన బాయ్ ఫ్రెండ్ (దర్శకుడు సామ్ అహ్మద్ బాంబే)తో కలిసి ప్రయాణిస్తున్న నటి పూనమ్ పాండేను మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వారిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని జోన్ వన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంగ్రామ్ సింగ్ నిశందర్ కన్పర్మ్ చేశారు. మెరైన డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 188.. 269 కింద కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని విడిచి పెట్టారు. వారు ప్రయాణిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. లాక్ డౌన్ వేళ.. ఇంట్లో ఉండాల్సింది పోయి.. బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న పూనమ్ పాండే వ్యవహారం సంచలనంగా మారింది.
This post was last modified on May 11, 2020 3:31 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…