మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ఇటీవలే 30 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంత హంగామా జరిగిందో తెలిసిందే. చిరంజీవి కూడా ఆ సినిమా విశేషాలు పంచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. మెగా అభిమానులు దీని మీద ట్విట్టర్లో మామూలు సందడి చేయలేదు.
ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాత అశ్వినీదత్ ఇప్పటికే తెర వెనుక విశేషాలు చాలానే వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం చెప్పారు. ఈ సినిమాకు చిరంజీవి, శ్రీదేవిలకు ఎంత పారితోషకం ఇచ్చిందని.. చివరికి తనకెంత లాభం మిగిలింది ఆయన వెల్లడించారు.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు గాను చిరంజీవికి రూ.35 లక్షల పారితోషకం ఇచ్చినట్లు దత్ వెల్లడించారు. అప్పట్లో హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న, బాలీవుడ్లోనూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న శ్రీదేవికి పాతిక లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చారట దత్. అందరి పారితోషకాలు, ఖర్చులు అన్నీ పోను తనకు రూ.35 లక్షలు మిగిలిందని దత్ వెల్లడించారు.
ఐతే ఇప్పటి లెక్కలతో చూస్తే అది చిన్న మొత్తంగా అనిపింవచ్చని.. కానీ అది అప్పట్లో చాలా పెద్ద మొత్తమని అన్నారు దత్. రూ.17-18 లక్షలు మిగిలితే సూపర్ హిట్ అనుకునేవాళ్లని.. అలాంటిది దాని మీద రెట్టింపు లాభం వచ్చిందంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్థం చేసుకోవచ్చని దత్ అన్నారు.
తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి భారీ బడ్జెట్లో దత్ ఈ సినిమాను నిర్మించారు. బాల్కనీ టికెట్ 6 రూపాయలుగా ఉన్న ఆ రోజుల్లోనే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రూ.7 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది వందల కోట్లన్నట్లే.
This post was last modified on May 11, 2020 6:29 pm
ప్రపంచస్థాయి సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు సాధించిన ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నుంచి ఆయన భార్య…
బాలీవుడ్ ఆల్ టైం సూపర్ స్టార్లలో షారుఖ్ ఖాన్ ఒకడు. గత ఏడాది జనవరి 25కు ముందు షారుఖ్ ఖాన్…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. హనుమకొండలో జరిగిన…
జగన్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు.…
వైసీపీ హయాంలో ఏపీలో కొత్త రోడ్లు వేయడం సంగతి పక్కన పెడితే రోడ్లపై ఉన్న గుంతలను సైతం పూడ్చ లేదని…