టాలీవుడ్లో ఘనచరిత్ర ఉన్న నాలుగు కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరిగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు ఘన వారసత్వాన్ని ఆ తర్వాతి తరంలో నాగార్జున కొనసాగించారు. తండ్రి స్థాయిలో రికార్డులు, విజయాలు లేకపోయినా.. తర్వాతి తరంలో నలుగురు అగ్రకథానాయకుల్లో ఒకరిగా ఉన్నాడు నాగ్. ఆయన స్థాయిలో కొన్ని భారీ విజయాలు అందుకున్నాడు. కానీ తర్వాతి తరం యువ కథానాయకుల ధాటికి మిగతా సీనియర్ హీరోల్లో నాగ్ నిలబడలేకపోయాడు. మధ్యలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో సత్తా చాటినా.. దానికి, ముందు తర్వాత దారుణమైన పరాజయాలు ఎదురయ్యాయి నాగార్జునకు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి మరీ ఇబ్బందికరంగా ఉంది. ‘ఆఫీసర్’, ‘మన్మథుడు-2’ లాంటి సినిమాలు నాగ్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టేశాయి. బాగా మార్కెట్‌ను దెబ్బ తీశాయి.
నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమాకు రిలీజ్ ముంగిట హైపే లేదు. బుకింగ్స్ మరీ పేలవం. సినిమాకు మంచి టాక్ వచ్చినా కూడా వసూళ్లు లేవు. వీకెండ్ మూడు రోజుల్లో కలిపి మూడు కోట్ల షేర్ కూడా రాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నాగ్ మార్కెట్ ఎంతగా దెబ్బ తిందో చెప్పడానికి ఇది రుజువు.
నాగ్ పరిస్థితి ఇలా ఉంటే.. ఆయన తనయుడు నాగచైతన్య ఒక స్థాయికి మించి స్టార్‌గా ఎదగలేకపోయాడు. మీడియం రేంజ్ హీరోగా స్థిరపడిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చైతూకు మాస్ ఇమేజ్ రాలేదు. అతడి చివరి సినిమా ‘మజిలీ’ మంచి విజయమే సాధించినా.. క్రెడిట్ ఎక్కువగా సమంతకే వెళ్లిపోయింది. కొత్త సినిమా ‘లవ్ స్టోరి’ విషయంలోనూ ఇలాగే జరిగేలా ఉంది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయినా సాయిపల్లవి క్రెడిట్లోకే వెళ్లేలా ఉంది. చైతూ మాస్ హీరోగా ఎదగలేకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
అఖిల్ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ.. అతను తొలి సినిమా బోల్తా కొట్టడంతో కెరీర్ తిరోగమనంలో పయనించడం మొదలైంది. హలో, మిస్టర్ మజ్ను సినిమాలు కూడా నిరాశ పరచడంతో మాస్ ఇమేజ్ సంగతలా ఉంచితే అఖిల్ ఒక హిట్టు కొడితే చాలనే స్థితిలో ఉన్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద ఎన్నో ఆశలతో ఉన్నాడు కానీ.. అదేమవుతుందో చూడాలి. అక్కినేని కుటుంంలో సుమంత్, సుశాంత్‌ల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. ఇలా అక్కినేని లెగసీ ఇప్పుడు పెద్ద ప్రమాదంలోనే కనిపిస్తోంది. ఈ స్థితి నుంచి ఈ ఫ్యామిలీ హీరోలు ఎలా పుంజుకుని లెగసీని నిలబెడతారో చూడాలి.
This post was last modified on April 6, 2021 7:40 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…