Movie News

అయోమయంలో రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి సంకట స్థితిని ఎదుర్కొంటున్నాడిప్పుడు. మామూలుగానే రాజమౌళి సినిమాలంటే అనుకున్న సమయానికి రిలీజ్ కావడం, ఆలస్యం అనివార్యం అనే ముద్ర ఉంది. ఆ ముద్ర సినిమా సినిమాకూ మరింత బలపడుతోంది. జక్కన్న సినిమా అంటే మొదట ప్రకటించిన రిలీజ్ డేట్‌కు రాదు అని జనాలు బలమైన అభిప్రాయానికి వచ్చేశారు. కనీసం రెండుసార్లు వాయిదా పడక తప్పదని కూడా అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు.

కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో రెండు వాయిదాలు కూడా సరిపోయేలా లేదు. రెండుసార్లు సినిమాను వాయిదా వేసి.. చివరికి ఈ ఏడాది అక్టోబరు 13న విడుదలకు ముహూర్తం చూడగా, దాన్ని అందుకోవడం పెద్ద టాస్కే అయ్యేలా కనిపిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మరోసారి వాయిదా అని ప్రచారం సాగుతున్నప్పటికీ.. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఎలాగైనా అక్టోబరు 13న థియేటర్లోకి దించేద్దాం అని జక్కన్న అండ్ టీం గట్టిగానే ప్రయత్నించింది కానీ.. పరిస్థితులు అనుకూలించడం లేదు.

సరిగ్గా ‘ఆర్ఆర్ఆర్’ కొత్త షెడ్యూల్ కోసం ఆలియా భట్ రావాల్సి ఉ:డగా.. ఆమె బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కరోనా బారిన పడటంతో తను ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ దశ పూర్తి చేసుకుని అయినా ఆలియా వస్తుందేమో అనుకుంటే.. ఇంతలో ఆమెకు కూడా కరోనా అని వెల్లడైంది. దీంతో రెండు మూడు వారాల పాటు ఆమె ఇంటి నుంచి కదిలే అవకాశం లేకపోయింది. దీంతో మళ్లీ షెడ్యూల్ తేడా కొట్టేసేలా ఉంది. షూటింగ్ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మే నెలాఖరుకు కూడా షూటింగ్ అవ్వకపోతే.. అక్టోబరు 13కు సినిమా సిద్ధం కావడం చాలా కష్టమే. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంలో ఏం చేయాలో పాలుపోని అయోమయంలో జక్కన్న అండ్ టీం ఉన్నట్లు సమాచారం.

This post was last modified on April 2, 2021 3:08 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

50 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago