కరోనా బ్రేక్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న అతి పెద్ద చిత్రం అంటే.. వకీల్ సాబ్‌యే. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కూడా కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. బాక్సాఫీస్ దగ్గర దీని క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాత దిల్ రాజు భారీ ప్రణాళికలతోనే ఉన్నాడు. ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లలో ఈ సినిమాను నడిపించబోతున్నారు. మల్టీప్లెక్సులు ఒకటీ అరా మినహాయిస్తే షోలన్నింటినీ ‘వకీల్ సాబ్’తో నింపేస్తే ఆశ్చర్యమేమీ లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 90 నుంచి 95 శాతం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ నడిచే అవకాశాలున్నాయి. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో సైతం ‘వకీల్ సాబ్’ను భారీ స్థాయిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం ‘వకీల్ సాబ్’ దూకుడు మామూలుగా ఉండబోదని స్పష్టమైంది.
ఓవర్సీస్‌లో ‘వకీల్ సాబ్’ రేంజ్ ఏంటో స్వయంగా ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి బోనీ కపూర్ వెల్లడించాడు. విదేశాల్లో ఈ చిత్రం ఏకంగా 700 థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు బోనీ వెల్లడించాడు. కరోనా బ్రేక్ తర్వాత ఓ భారతీయ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున రిలీజవడం ఇప్పుడే. ఈ 700 థియేటర్లలోనూ విడుదలకు ముందు రోజు, ఏప్రిల్ 8న ప్రిమియర్స్ వేయబోతున్నామని, పవర్ స్టార్ మేనియా చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలని బోనీ పిలుపునిచ్చాడు.
ఏపీ, తెలంగాణల్లో కలిపి 2 వేలకు తక్కువ కాకుండా థియేటర్లలో ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే అవకాశముంది. ఇక కర్ణాటకలో పవన్ సినిమాలు ఎంత పెద్ద ఎత్తున రిలీజవుతాయో తెలిసిందే. దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కలుపుకుంటే.. మొత్తంగా వకీల్ సాబ్ సినిమా అటు ఇటుగా 4 వేల థియేటర్లలో రిలీజయ్యే అవకాశముంది.
This post was last modified on April 2, 2021 6:48 am
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…