ఇంకొన్ని గంటల్లోనే అక్కినేని నాగార్జున సినిమా ‘వైల్డ్ డాగ్’కు యుఎస్‌లో ప్రిమియర్స్ పడబోతున్నాయి. ఆ తర్వాత కొన్ని గంటలకు ఇండియాలో సినిమా రిలీజ్ కాబోతోంది. సినిమా ఫలితం కోసం ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్‌ను ఇంటర్నెట్లో పెట్టేయడం కలకలం రేపుతోంది. పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేసే వెబ్ సైట్లో ‘వైల్డ్ డాగ్’ లింక్ ఉన్న స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
ఇంకా థియేటర్లలో రిలీజే కాని సినిమాను పైరసీ చేయడమేంటి.. పైకి ‘వైల్డ్ డాగ్’ పేరు పెట్టి ఇంకేదో సినిమా చూపించారేమో అనుకోవడానికి కూడా లేకపోయింది. సినిమాలోని కొన్ని షాట్లకు సంబంధించిన విజువల్స్ తాలూకు స్క్రీన్ షాట్లు కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అవి ట్రైలర్లో చూసినవి కూడా కాదు. కొత్తవి.
దీన్ని బట్టి ‘వైల్డ్ డాగ్’ పైరసీ ప్రింట్ ఇంటర్నెట్లోకి వచ్చిన మాట వాస్తవమే అని అర్థమవుతోంది. ఐతే నాగ్ అభిమానులు వెంటనే స్పందించి నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌కు విషయం చేరవేశారు. వాళ్లు అలెర్ట్ అయి పైరసీ వెబ్ సైట్ నుంచి లింక్ తీయించారు. ఎక్కడైనా లింకులు కనిపిస్తే తమకు వెంటనే చెప్పాలని పిలుపునిచ్చారు. ఐతే ఇంకా థియేటర్లలో బొమ్మ పడకుండానే ఈ సినిమా ఎలా ఇంటర్నెట్లోకి వచ్చిందన్నది ప్రశ్నార్థకం. కచ్చితంగా ఇది ఇంటి దొంగల పనే అన్నది స్పష్టం.
‘అత్తారింటికి దారేది’ సినిమా తరహాలోనే ఎవరో చిత్ర బృందంలోని వారే సినిమాను లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై నిర్మాణ సంస్థ పరిశీలనలో ఏం తేలుతుందో చూడాలి. వరుస డిజాస్టర్లతో అల్లాడిపోతున్న నాగార్జునకు ఈ సినిమా హిట్టవడం చాలా అవసరం. ఇలాంటి స్థితిలో సినిమా పైరసీ కావడం ఆయనతో పాటు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేసేదే.
This post was last modified on April 1, 2021 1:52 pm
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్హోల్లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…