పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి వస్తుంటే ఆ యుఫోరియా ఎలా ఉంటుందన్నది కొంత విరామం తర్వాత అందరూ చూస్తున్నారు. పవన్ ఎలాంటి కథను ఎంచుకున్నాడు.. అది క్లాసా మాసా.. అది స్ట్రెయిట్ సినిమానా రీమేక్ మూవీనా.. కొత్త దర్శకుడా స్టార్ డైరెక్టరా.. ఇవేవీ సంబంధం లేకుండా ఆటోమేటిగ్గా హైప్ వచ్చేస్తుంది రిలీజ్ టైంకి. ‘వకీల్ సాబ్’ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా మొదలైనపుడు పెదవి విరిచినవాళ్లే ఎక్కువ. ఎందుకంటే అది లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిన ‘పింక్’కు రీమేక్. పైగా ఏమంత మంచి రికార్డు లేని వేణు శ్రీరామ్ దీనికి దర్శకుడు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ఈ అభ్యంతరాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చేసింది.
సంక్రాంతి సీజన్‌ను పక్కన పెడితే.. పవన్ సినిమా రిలీజవుతుంటే దాంతో నేరుగా మరే చిత్రం పోటీకి రాదు. అతడి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ముందు, వెనుక రిలీజయ్యే సినిమాలకు ముప్పు తప్పుదు. ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నాయి వైల్డ్ డాగ్, సుల్తాన్, లవ్ స్టోరి సినిమాలు. బాగా డల్లుగా నడుస్తున్న నాగ్ కెరీర్‌కు ఎంతో ముఖ్యమైన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఆఫీసర్, మన్మథుడు-2 సినిమాల దెబ్బకు ఆయన మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ‘వైల్డ్ డాగ్’తో కచ్చితంగా పుంజుకోవాలి. దీనికి పోటీగా తమిళ అనువాద చిత్రం ‘సుల్తాన్’ కూడా రిలీజవుతోంది.
ఈ రెండు సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా వారం తర్వాత వాటి అడ్రస్ గల్లంతవ్వాల్సిందే. పవన్ సినిమా అంటే రెండు మూడు రోజుల ముందు నుంచే హంగామా మొదలైపోతుంది. ఆ సినిమా కోసం ఎదురు చూసే మూడ్‌లో ముందు వారం వచ్చిన సినిమాలకు వెళ్లడం కష్టమే. వీకెండ్ తర్వాత వీటి పరిస్థితి కష్టమే కావచ్చు. చాలా మంచి టాక్ తెచ్చుకుంటే తప్ప వాటి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇక పవన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. తర్వాతి వారం వచ్చే ‘లవ్ స్టోరి’కి చిక్కులు తప్పవు. ఆ సినిమా మీద మంచి అంచనాలున్నా సరే.. థియేటర్ల సమస్య ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని అటు వైపు మళ్లించడం కష్టమే. ‘వకీల్ సాబ్’ రిలీజ్ దగ్గర పడేకొద్దీ హైప్ పెరుగుతుండటం, ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా కనిపిస్తుండటంతో ముందు, వెనుక సినిమాలకు గట్టి దెబ్బే తగిలేలా ఉంది.
This post was last modified on March 30, 2021 9:41 pm
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…
మలయాళంలో చాలా మంచి పేరున్న స్టార్ హీరోల్లో నివిన్ పౌలీ ఒకడు. స్టార్ హీరో అన్న అహం లేకుండా చాలా…