‘వకీల్ సాబ్’ ప్రోమోలు చూస్తున్న వాళ్లకు ఇది బాలీవుడ్ మూవీ ‘పింక్’కు రీమేక్ అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని చేసిన మార్పులు, చేర్పులతో దీని కలరే మారిపోయినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రనే ఇక్కడ పవన్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయన చేయని చాలా పనులు పవన్ చేసేలా కనిపిస్తున్నాడు. విలన్లతో ఫైటింగులు.. హీరోయిన్‌తో రొమాన్స్.. పాటలు, డ్యాన్సులు.. ఇలా చాలా వ్యవహారమే ఉన్నట్లుంది.
పవన్ పాత్రకు కొత్తగా ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సైతం పెట్టినట్లున్నారు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలను చేర్చడం, పవన్ పాత్ర నిడివి పెంచడంతో సినిమా ఓవరాల్ లెంగ్త్ కూడా బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘వకీల్ సాబ్’ దాదాపు మూడు గంటల సినిమా అట. ఆ నిడివికి ఐదారు నిమిషాలు మాత్రమే తక్కువగా ఉంటుందట.
‘పింక్’ రన్ టైం 2 గంటల 16 నిమిషాలు మాత్రమే. కేవలం ఒరిజినల్లోని కథను మాత్రమే తీసుకుంటే ‘వకీల్ సాబ్’ నిడివి కూడా అలాగే ఉండేది. కానీ పవన్ పాత్రను పెంచడం.. ఫ్లాష్ బ్యాక్, పాటలు యాడ్ చేయడంతో దీని నిడివి 40 నిమిషాల మేర పెరిగినట్లు తెలుస్తోంది. ఒక సినిమాను వేరే భాషలో రీమేక్ చేసినపుడు నిడివి ఇంతగా పెరిగిన సందర్భాలు దాదాపు జరిగి ఉండవు. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.
తమ మనోభావాలను అర్థం చేసుకుని దర్శకుడు వేణు శ్రీరామ్ తాము కోరుకున్నట్లుగా సినిమాను తీర్చిదిద్దాడని అంటున్నారు. వేణును మాస్ గాడ్ అంటూ సరదాగా సంబోధిస్తుండటం.. ‘వకీల్ సాబ్’ను ఇప్పుడు బాలీవుడ్ వాళ్లు రీమేక్ చేసుకునేలా తయారైందని అంటుండటం విశేషం. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 28, 2021 6:42 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…