మెగా ఫోన్ పట్టి ఒక సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ ఆ పని చేయలేరు. వేరే విభాగాల్లో దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ దర్శకత్వం చేయడానికి సాహసించరు. నటుల్లో డైరెక్షన్ వైపు అడుగులు వేసేవాళ్లు మరీ తక్కువమంది. ఒకవేళ దర్శకత్వం చేపట్టాలనుకున్నా సేఫ్‌గా ఒక కమర్షియల్ సినిమా తీయడానికి చూస్తారు. దర్శకులుగా మరీ రిస్క్ చేయడానికి చూడరు. కానీ మలయాళ నటుడు మోహన్ లాల్ మాత్రం మెగా ఫోన్ పెట్టి ఒక మెగా మూవీ తీయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.
ఆయన బరోజ్ అనే సినిమాతో దర్శకుడిగా మారనున్నట్లు ఇంతకుముందు సమాచారం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ సినిమాను అంగరంగ వైభవంగా మొదలుపెట్టాడు లాల్. మమ్ముట్టి, పృథ్వీరాజ్, దిలీప్, ప్రియదర్శన్ లాంటి అతిరథ మహారథులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక నిర్వహించిన తీరుతోనే ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అనే విషయం అర్థమైపోయింది.
వాస్కోడిగామా దగ్గర నిధి పరిరక్షకుడిగా ఉన్న బరోజ్ ఆనే చరిత్రకారుడి కథతో ఈ సినిమా తెరకెక్కనుండటం విశేషం. ఇందులో బరోజ్ పాత్ర చేయబోతోంది మోహన్ లాలే. కేరళ-పోర్చుగల్ నేపథ్యంలో కొన్ని వందల కిందటి సంవత్సరాల పరిస్థితుల్లో ఈ కథ నడుస్తుందట. ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా ప్రపంచ స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు మోహన్ లాల్. రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని త్రీడీలో తీయబోతుండటం విశేషం.
ఇంత భారీ ప్రాజెక్టును కొమ్ములు తిరిగిన దర్శకులే డీల్ చేయడానికి భయపడతారు. అలాంటిది ఒక నటుడు దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ఇంత భారీ సినిమాను నెత్తికెత్తుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. బరోజ్ ఫస్ట్ లుక్‌లో లాల్ అవతారం కూడా చాలా భిన్నంగా కనిపిస్తోంది. సినిమా గ్రాండియర్‌ను చాటేలా ఉంది ఫస్ట్ లుక్. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చనుండటం విశేషం. దృశ్యం-2 నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది.
This post was last modified on March 25, 2021 10:18 am
నిన్న విడుదలైన సినిమాల్లో బలహీనమైన టాక్ వచ్చింది దేవకీనందన వాసుదేవకే. హీరో తర్వాత అశోక్ గల్లా చాలా గ్యాప్ తీసుకుని…
అందరి మనసులని తొలిచేస్తున్న కొన్ని అంశాలపై పక్కా క్లారిటీ ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వచ్చే సార్వత్రిక…
ఊహించని స్థాయిలో భారీ వసూళ్లతో గత ఏడాది బాక్సాఫీస్ కొల్లగొట్టిన బేబీ హిందీ రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. హీరోగా…
పాలు తాగే పసికందు నుంచి పండు ముసలి వరకు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాష్ట్ర జనాభా మీద ఉన్న అప్పు భారం…
అమెరికాలో అదానీపై కేసు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.…