మెగాస్టార్ చిరంజీవి తెరపైనే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ హీరోనే అని ఇండస్ట్రీ జనాలు చాలామంది అంటారు. ఆయన వివిధ సందర్భాల్లో తమకు చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఐతే టాలీవుడ్ జనాలు ఇలా చిరు గొప్పదనం గురించి చెప్పడం మామూలే. కానీ ఇప్పుడు ఓ అగ్ర తమిళ నటుడు చిరు సాయం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తన జీవితాన్ని నిలబెట్టింది చిరునే అంటూ ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆ నటుడు శరత్ కుమార్ కావడం విశేషం. చిరుతో గ్యాంగ్ లీడర్, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాల్లో శరత్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఐతే తాను హీరోగా నిలదొక్కుకోవడానికి ముందు ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నానని.. అప్పుడు తనను ఆదుకుంది చిరునే అని శరత్ వెల్లడించాడు.
తన భార్య రాధికతో కలిసి ఓ తెలుగు ఛానెల్‌తో మాట్లాడిన శరత్.. ఈ ఉదంతం గురించి వివరించారు. తన ఆర్థిక కష్టాల గురించి ఓ నిర్మాతతో చెబితే.. చిరంజీవి డేట్లు ఇప్పిస్తే సినిమా తీసి అందులోంచి వచ్చిన లాభంతో తన కష్టాలన్నీ తీరుస్తానని ఆయన చెప్పారని.. దీంతో తాను చిరును కలవడానికి వెళ్లానని శరత్ తెలిపాడు.
ఓ స్టూడియోలో షూటింగ్ జరుగుతుండగా.. తాను వెళ్లి పర్సనల్‌గా మాట్లాడాలని అంటే మధ్యాహ్నం తర్వాత షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ తనను చిరు ఇంటికి తీసుకెళ్లాడని.. భోజనం చేయించి తనకు వడ్డించాడని తర్వాత తాను తన కష్టం చెప్పుకున్నానని శరత్ వెల్లడించాడు. అప్పటికి ఓ సినిమా కమిట్మెంట్ ఉందని.. అదయ్యాక సినిమా చేస్తానన్నాడని.. రెమ్యూనరేషన్ గురించి అడిగితే, నువ్వు కష్టాల్లో ఉండి సాయం అడిగితే రెమ్యూనరేషన్ ఎలా తీసుకుంటానంటూ ఫ్రీగా కాల్ షీట్లు ఇచ్చాడని శరత్ తెలిపాడు.
ఈ సంగతి చెబుతూ.. శరత్ గొంతు బొంగురుబోయింది. కళ్లలో నీళ్లు కూడా తిరిగాయి. ఐతే చిరు కాల్ షీట్లతో తీసిన సినిమా ఏది అన్నది మాత్రం శరత్ చెప్పలేదు. ఐతే ఈ సాయం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని మాత్రం అన్నాడు.
This post was last modified on May 10, 2020 5:09 pm
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప 2 ది రూల్ తర్వాత మూడో భాగం ది ర్యాంపేజ్…
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ మళ్ళీ ఊపందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుకి దక్కిన ఆదరణే దానికి సాక్ష్యం.…
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…
టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…
నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…
టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…