ఏంటి అందాల నిధి ఏమైనా బాబా అవతారం ఎత్తిందా? లేక ఈమె కొంపదీసి డాక్టరు చదివిందా …? అని ఆశ్చర్యపోతున్నారా? అదేం కాదు. ఆస్క్ నిధి అంటూ లాక్ డౌన్ లో ఖాళీగా ఉన్న నిధి అభిమానులతో ముచ్చటిస్తోంది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇస్తోంది. ఈ సమాధానాలు బట్టి చూస్తే… నిధికి మంచి టైమింగ్ ఉందనిపిస్తోంది. ఒక అభిమాని… ‘‘నీకు సూపర్ పవర్స్ ఉంటే ఏం చేసేదానివి’’ అని అడిగారు. దానికి చాలా స్పాంటేనియస్ గా… కరోనాను నయం చేస్తాను అంటూ చెప్పింది. ఈ సమాధానానికి అభిమానులు ఫిదా అయ్యారు.
మరో అభిమాని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటావా అంటే… నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు ఒక అభిమాని నువ్వు సింగిలా అని అడిగితే అవును సింగిలే అంది. అభిమానులను ఏమని వర్ణిస్తావు అంటే ’బంగారమ్స్’ అంటూ ముద్దుగా చెప్పింది. ఓ అభిమాని అందరికీ రిప్లై ఇస్తావు నాకెందుకు ఇవ్వవు అంటే… సారీ బంగారం నాకున్నది రెండు చేతులేగా అంటూ క్యూట్ గా చెప్పింది. అచ్చ తెలుగు అభిమాని అడగడానికి ఏమీ లేదన్నట్టు నీకు పచ్చళ్లు ఇష్టమా అని అడిగాడు. ఇంతకుముందు కాదు.. లాక్ డౌన్ కారణంగా వాటికి ఫ్యాన్ అయ్యాను, తెగ తింటున్నాను అని చెప్పింది. అపజయాలను ఎలా తీసుకుంటావు అని అడిగితే… త్రివిక్రమ్ స్టైల్లో విజయంతో చంపేస్తా, నవ్వుతో పూడ్చేస్తా అని పంచ్ పేల్చింది. కాఫీ తాగుతావా? టీ తాగుతావా? అని ఓ చిలిపి ప్రశ్న ఎదురవగా.. ఇంట్లో టీ, బయట కాఫీ అంటూ కాఫీ-టీ రెండింటి అభిమానులను మెప్పించింది. నువ్వు సినిమా చేసిన రామ్ గురించి ఓ మాట చెప్పమంటే… ఒకటి కాదు, రెండు చెప్తా అంటూ… ’’డబుల్ దిమాక్‘‘ అని వ్యాఖ్యానించింది.
ఇంకా ఏం చెప్పిందంటే… తాను నిత్యం ధ్యానం చేస్తానని, అనిమల్ లవర్ ని అని చెప్పింది. ఏ మాటకామాట… నిధిలో టైమింగ్ తో పాటు సెన్సాఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువే ఉన్నట్టు అర్థమవుతోంది. ఏ సమాధానమైనా తుడుముకోకుండా చెప్పడమే కాకుండా… ఆసక్తికరంగా చెబుతోంది. అందాల నిధివే కాదు, జ్జాన నిధివి కూడా అనాలేమో !
This post was last modified on April 9, 2020 6:28 pm
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు…
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…