గుత్తా జ్వాల త్వరలోనే మళ్లీ పెళ్లి కూతురు కాబోతోంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త, తమిళ నటుడు విష్ణు విశాల్ ధ్రువీకరించాడు. రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన అరణ్య సినిమా తెలుగు, తమిళ వెర్షన్లలో విష్ణు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విష్ణు.. జ్వాలతో తన ప్రేమాయణం, పెళ్లి గురించి వెల్లడించాడు.
కొన్ని నెలల కిందట విష్ణు పుట్టిన రోజు సందర్భంగా అతడితో జ్వాల రింగ్ తొడిగించుకుని తామిద్దరం ఎంగేజ్ అయినట్లుగా వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ తర్వాత పెళ్లి గురించే ఏ చర్చా లేకపోయింది. ఐతే అరణ్య ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జ్వాల, తాను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని.. తెలుగు అల్లుడు కాబోతున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు విష్ణు.
జ్వాలను పెళ్లి చేసుకోవడమే కాదు.. ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తానని విష్ణు తెలిపాడు. జ్వాల జీవితంలో సినిమాకు సరిపడా డ్రామా ఉందని, ఆమె ఆటలో గొప్ప స్థాయిని అందుకుందని విష్ణు అన్నాడు. తన సొంత బేనర్లో జ్వాలపై సినిమా తీయబోతున్నట్లు అతను వెల్లడించాడు. తెలుగులోకి రీమేక్ అయిన భీమిలి కబడ్డీ జట్టు, సిల్లీ ఫెలోస్, రాక్షసుడు లాంటి చిత్రాల మాతృకలతో తమిళంలో పెద్ద విజయాలందుకున్నాడు విష్ణు.
ప్రస్తుతం అతను హీరోగా మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. విష్ణుకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అతడి తండ్రి ఐపీఎస్ అధికారి. తమిళనాట పెద్ద పోస్టులో ఉన్నారు. విష్ణుకు ఇంతకుముందు ఓ అమ్మాయితో పెళ్లవగా.. తనతో పొసగక విడాకులు తీసుకున్నాడు. జ్వాల సైతం తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌ను పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వాత అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on March 24, 2021 7:19 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…