ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కొందరు మాత్రం ముందు రచ్చ గెలిచి ఇంట గెలవడానికి వస్తుంటారు. సినీ రంగంలో ఇది చాలామంది విషయంలో జరిగింది. ఐశ్వర్యా రాజేష్ కూడా ఈ కోవకే వస్తుంది. ఈమె తెలుగమ్మాయి అనే సంగతి చాలామందికి తెలియదు. ఆమె తండ్రి రాజేష్ 80ల్లో తెలుగులో బిజీ ఆర్టిస్ట్. అనారోగ్యంతో తక్కువ వయసులోనే అతను కాలం చేశాడు. ముందు నుంచి రాజేష్ కుటుంబం చెన్నైలోనే ఉండటంతో ఆయన పోయాక కూడా కుటుంబం అక్కడే ఉండిపోయింది. తండ్రి మరణానంతరం ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని, కొంతం కాలం ఉద్యోగం చేసి.. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగు పెట్టి చిన్న చిన్న పాత్రలతో సత్తా చాటి.. ఆ తర్వాత కథానాయికగా స్థిరపడింది ఐశ్వర్య.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా ఉంటోంది ఐశ్వర్య. ఐతే ఆమె రెగ్యులర్ స్టార్ హీరోయిన్ల లాగా గ్లామర్ రోల్స్ పెద్దగా చేయదు. ఏదో ఒక ప్రత్యేకత ఉంటే తప్ప ఏ పాత్రా ఒప్పుకోని ఐశ్వర్య.. కాకా ముట్టై, వడ చెన్నై, కనా లాంటి సినిమాలతో సత్తా చాటింది. ఇప్పుడు ఐశ్వర్య కెరీర్లో మైలురాయిగా నిలిచే అవకాశమున్న మరో పాత్ర ఆమె తలుపు తట్టింది. మలయాళంలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ రీమేక్‌లో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషించనుంది. ఇందులో ఆమెకు జోడీగా రాహుల్ రవీంద్రన్ నటించనుండటం విశేషం.
ఒక సంప్రదాయ కుటుంబంలోకి కోడలిగా వచ్చిన అమ్మాయి అక్కడి కట్టుబాట్ల వల్ల ఎలా ఇబ్బంది పడింది.. ఇంతగా అభివృద్ధి చెందాక కూడా మహిళల్ని సమాజం ఎలా తక్కువగా చూస్తుంది.. చదువుకున్న భర్తలు కూడా కట్టుబాట్ల పేరుతో మహిళల పట్ల ఎలా వివక్ష చూపిస్తారనే అంశాల్ని చాలా సున్నితంగా చర్చించిన సినిమా ఇది. చిన్న కాన్సెప్ట్ తీసుకుని హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం గొప్ప ప్రశంసలు అందుకుంది. ఒరిజినల్లో సూరజ్, నిమిష ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాలో హీరోయిన్‌దే అత్యంత కీలక పాత్ర. అలాంటి క్యారెక్టర్ ఐశ్వర్యను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాతో ఐష్ పేరు మరోసారి కోలీవుడ్లో హాట్ టాపిక్ అవడం గ్యారెంటీ అంటున్నారు. రాహుల్, ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కాబట్టి ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
This post was last modified on March 23, 2021 1:05 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…