ఈ రోజుల్లో సినిమాకు ప్రి రిలీజ్, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందు ప్రమోషన్ అంటే ఏమాత్రం పట్టని స్టార్లు కూడా ఇప్పుడు.. కాలికి బలపం కట్టుకుని మీడియా చుట్టూ తిరిగేస్తున్నారు. ఐతే ఊరికే ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే.. ఈవెంట్లు పెట్టేస్తే జనాలొచ్చి సినిమా చూసేస్తారనుకోవడానికి లేదు. అగ్రెసివ్‌గా ప్రమోషన్లు చేసిన సినిమాలు కూడా అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు కోకొల్లలు. సినిమాలో విషయం ఉండాలి. అలాగే ప్రమోషన్లు కూడా కొంచెం భిన్నంగా చేయాలి. వాటితో జనాలు కనెక్ట్ అయ్యేలా ఉండాలి.
ఈ విషయంలో ఇప్పుడు ‘జాతిరత్నాలు’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు మించి భారీగా వసూళ్లు వస్తున్నాయంటే అందుకు ప్రమోషన్లు కూడా ఒక కారణం. విడుదలకు ముందు టీం రిలీజ్ చేసిన ఫన్నీ ప్రోమోలు సినిమా మీద ఆసక్తిని పెంచి క్రేజ్ తీసుకొస్తే.. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫారియాలు వివిధ ఈవెంట్ల ద్వారా, సినిమాను ఆహ్లాదకరమైన రీతిలో ప్రమోట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ‘జాతిరత్నాలు’ టీం చేస్తున్న వెరైటీ ప్రమోషన్ చర్చనీయాంశం అవుతోంది.
తెర మీద మనం చూసిన పాత్రల తాలూకు లక్షణాలనే బయట కూడా చూపిస్తూ నవీన్, దర్శి, రాహుల్ జనాలను భలేగా ఎంగేజ్ చేస్తుండటం విశేషం. సినిమాలో ఈ పాత్రల్లో కనిపించే అమాయకత్వం, అతి తెలివిని బయట కూడా ఈ ముగ్గురూ చూపిస్తున్నారు. సినిమాలోని ఫన్నీ డైలాగులను బయట కూడా పేలుస్తున్నారు. మొన్న సక్సెస్ మీట్లో ఈ ముగ్గురూ జనాలను ఎంతగా ఎంగేజ్ చేశారో తెలిసిందే.
నవీన్, దర్శి ప్రమోషన్ల కోసం అమెరికాకు వెళ్లగా.. ఏదో కారణంతో వెళ్లలేకపోయిన రాహుల్.. తనను వాళ్లిద్దరూ వదిలేసి వెళ్లిపోయారంటూ కౌంటర్ వీడియో వదలడం.. దానికి నవీన్, దర్శి యుఎస్ నుంచి తమదైన శైలిలో బదులివ్వడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక సినిమాలో రాహుల్ పాత్ర.. ‘‘నావల్లే ప్రాబ్లం అవుతుందంటే నేనెళ్లిపోతారా’’ అంటూ పేల్చే హిలేరియస్ డైలాగ్‌ను ప్రమోషన్లలో భలేగా వాడుతున్నారు. దీని మీద వస్తున్న మీమ్స్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అలాగే సినిమాలో వచ్చే ఫన్నీ రైమింగ్స్‌ను కూడా ప్రమోషన్లకు బాగా వాడుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రమోషన్ల పరంగా ‘జాతిరత్నాలు’ టాలీవుడ్‌కు ఒక పాఠంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 22, 2021 6:34 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…