ఒక సినిమా ప్రమోషన్లలో అత్యంత కీలకం హీరోనే. హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, మిగతా నటీనటులు, టెక్నీషియన్లు.. ఇలా ఎందరు సినిమాను ప్రమోట్ చేసినా, హీరో రంగంలోకి దిగితే వచ్చే పబ్లిసిటీనే వేరు. ముఖ్యంగా హీరోల చుట్టూనే అన్నీ తిరిగే టాలీవుడ్లో.. సినిమాల ప్రమోషన్లలో వారి పాత్ర ఇంకా కీలకం. గత కొన్నేళ్లలో లాంగ్ రన్‌కు కాలం చెల్లి.. తొలి వారం వసూళ్లే అత్యంత ప్రధానంగా మారిన నేపథ్యంలో స్టార్ హీరోలందరూ ప్రమోషన్ ప్రాధాన్యాన్ని గుర్తించి తమ చిత్రాలకు మాంచి పబ్లిసిటీ ఇస్తున్నారు. ఒకప్పుడు తన సినిమాల వేడుకల్లో కూడా పాల్గొనని మహేష్ బాబు సైతం ఈ మధ్య తన చిత్రం విడుదల అనగానే ప్రెస్ మీట్లలో పాల్గొనడంతో పాటు టీవీ ఛానెళ్లకు కూడా వెళ్లి ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ప్రమోషన్లకు దూరంగా ఉంటున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే.
పవన్ మహా అయితే తన సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వస్తాడు. అక్కడ కూడా సినిమా అలా ఉంది ఇలా ఉంది అనేమీ మాట్లాడడు. ప్రమోషన్‌కు పెద్దగా ఉపయోగపడని మాటలేవో కొన్ని మాట్లాడి వెళ్లిపోతాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి ఒకటీ అరా చిత్రాలకు మాత్రమే పవన్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అంతకుమించి తన సినిమాలను ప్రమోట్ చేసింది లేదు. మూడేళ్ల విరామం తర్వాత తన నుంచి ‘వకీల్ సాబ్’ సినిమా వస్తుంటే.. ఇప్పుడు కూడా పవన్‌లో ఏమీ కదలిక లేదు. ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా వేయలేదు పవన్. ఇక బయట ప్రమోషన్ల గురించి చెప్పాల్సిన పని లేదు.
దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి కలిసి టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిస్తూ సినిమాను ప్రమోట్ చేస్తుండటం విశేషం. దుండిగల్‌లో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫెస్టివల్‌లో కూడా వీళ్లే కీలకం కానున్నారు. పవన్ ఈ వేడుకకు వచ్చే అవకాశం లేదు. ఏప్రిల్ 3న ప్రి రిలీజ్ ఈవెంట్లో మాత్రమే పవన్ పాల్గొనబోతున్నాడు. ఐతే పవన్ ‘వకీల్ సాబ్’ను ప్రమోట్ చేయకపోతేనేం.. కేవలం ప్రోమోలతోనే ఆ చిత్రం కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. నిజానికి పవన్ తన సినిమాను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఆయన ప్రతి చిత్రానికీ కావాల్సినంత హైప్ వస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే హైప్ డబుల్ అవుతుంది. వసూళ్ల మోత మోగిపోతుంది. ఇలాంటి క్రేజ్ అందరు స్టార్లకూ సాధ్యం కాదు.
This post was last modified on March 20, 2021 9:01 pm
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……