ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా ‘జాతిరత్నాలు’ గురించే చర్చంతా. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. హీరో నవీన్ పొలిశెట్టి అయితే ఈ సినిమాతో మంచి మార్కెట్ తెచ్చుకుని మంచి స్థాయికి వెళ్లేట్లే కనిపిస్తున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు ఇంకా డిమాండ్ పెరిగేలా ఉంది. ఈ చిత్రంతోనే కథానాయికగా పరిచయం అయిన ఫారియా అబ్దుల్లాకు సైతం చాలా మంచి పేరే వచ్చింది. కాకపోతే ట్రెడిషనల్ గ్లామర్ హీరోయిన్ల లాగా కాకుండా టిపికల్‌గా కనిపించే ఈ అమ్మాయికి కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు దక్కుతాయా.. ఆమెను గ్లామర్ తారగా చూడ్డానికి జనాలు ఇష్టపడతారా అన్నదే కొంచెం సందేహంగా ఉంది. కానీ టాలీవుడ్ ఫిలిం మేకర్స్ అలా ఏమీ ఆలోచిస్తున్నట్లు లేరు. ఆమెకు ఒక పెద్ద స్టార్ సరసన ఓ కమర్షియల్ సినిమాలోనే కథానాయికగా అవకాశం దక్కడం విశేషం.
తన రెండో సినిమాలో మాస్ రాజా రవితేజతో రొమాన్స్ చేయబోతోంది ఫారియా అబ్దుల్లా. ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న రవితేజ.. దీని తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారయ్యారు. తమిళ అమ్మాయి ఐశ్వర్యా మీనన్‌తో పాటు కన్నడ భామ శ్రీలీలను కథానాయికలుగా ఎంపిక చేశారు. అంతటితో హీరోయిన్ల సంగతి ఓకే అయినట్లే అనుకున్నారు. కానీ ఈ చిత్రంలో ఫారియా సైతం ఒక పాత్రకు ఎంపిక కావడం విశేషం. అదేమీ స్పెషల్ రోల్ కూడా కాదు. రవితేజకు జోడీగానే ఆమె కూడా నటించబోతున్నట్లు చెబుతున్నారు. మరి ముగ్గురు హీరోయిన్లకు ఈ సినిమాలో ఎంత స్కోప్ ఉంటుందో.. ఫారియా ఏమాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటుందో చూడాలి. తొలి చిత్రంలో ఒక మామూలు అమ్మాయిలా కనిపించిన ఫారియా.. ఈ చిత్రంలో గ్లామరస్‌గా కనిపించి తనలో కొత్త కోణాన్ని చూపిస్తుందేమో చూడాలి.
This post was last modified on March 20, 2021 8:58 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…