తెలుగు సినిమా చరిత్రలో క్రేజ్ అనే మాట తీసుకుంటే.. ముందు గుర్తుచ్చే పేర్లలో పవన్ కళ్యాణ్‌ది ఒకటి. అన్న చిరంజీవి వారసత్వాన్నందుకుని సినిమాల్లో అడుగుపెట్టినప్పటికీ.. ఆయన నీడ నుంచి త్వరగానే బయటికి వచ్చేశాడు పవన్. కెరీర్లో కొన్నేళ్లు గడిచేసరికి తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణీ ఏర్పరుచుకుని.. సొంత ఫ్యాన్ బేస్‌ను పెంచుకుని పవర్ స్టార్‌గా ఎదిగాడు. ఒక దశలో పదేళ్ల పాటు హిట్టు లేకపోయినా సరే.. పవన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు.
‘గబ్బర్ సింగ్’తో బ్యాంగ్ బ్యాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు పవన్. ఇక పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నా.. రీఎంట్రీ కోసం ‘పింక్’ లాంటి సోషల్ కాజ్ ఉన్న మూవీ ఎంచుకున్నా సరే.. ‘వకీల్ సాబ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు రెస్పాన్స్ ఎలా ఉందో.. పవన్ క్రేజ్ ఎలాంటిదో అందరూ చూశారు. పవన్ తాలూకు ప్రభావం ఆయన కొడుకు అకీరా నందన్ మీద కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.
అకీరా తండ్రితో ఉన్నది చాలా తక్కువ. సినీ వాతావరణంలో పెరగలేదు. ఇక్కడి హడావుడికి దూరంగా చాలా ఏళ్లు పుణెలో పెరిగాడు. యుక్త వయసు వచ్చాక కూడా తల్లి రేణు దేశాయ్‌తోనే ఉంటున్నాడు. అయినా సరే.. ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా అకీరాకు సోషల్ మీడియాలో కనిపిస్తున్న క్రేజ్ చూస్తే వామ్మో అనిపించకమానదు. పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద బోలెడన్ని ఎడిట్స్ చేశారు ఫ్యాన్స్. బర్త్ డే కామన్ డీపీ సహా ఎన్నో ఎడిట్స్ కనిపిస్తున్నాయి. వేల కొద్దీ ట్వీట్లు పడుతున్నాయి.
సినీ రంగం నుంచి అల్లు అర్జున్ తర్వాత ఆ స్థాయిలో ట్రెండ్ అవుతున్న పేరు అకీరాదే. ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకముందే అకీరాకు సోషల్ మీడియాలో ఇంత క్రేజ్ కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ అకీరాకు సినిమాల్లో నటించే ఉద్దేశం ఉందో లేదో కానీ.. పవన్ ఫ్యాన్స్ అయితే అతడికి రెడ్ కార్పెట్ వేసి వెల్కం చెప్పడానికి.. పవన్ మీద చూపించే అభిమానాన్ని అతడి మీదా చూపించడానికి రెడీ అయిపోయినట్లున్నారు.
This post was last modified on April 9, 2020 6:25 pm
సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్, అతని భార్య సైరా భాను మధ్య విడాకుల ప్రకటన తీవ్ర చర్చకు దారి తీసిన…
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. నేటి ఐపీఎల్ మెగా…
ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అనేక విమర్శలు, వ్యాఖ్య లు వినిపించాయి. స్వామి…
తమిళ్ సినీ ఇండస్ట్రీలో హీరోల కంటే కూడా వాళ్ళ ఫాన్స్ మధ్య ఎక్కువ రచ్చ జరుగుతూ ఉంటుంది. కానీ హీరోల…
మహేష్ బాబు వంశీ మూవీ తో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత మెగాస్టార్ అంజి చిత్రంతో మంచి గుర్తింపు…
భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా…