Movie News

ఏ సినిమా ఎలా ఆడుతుందో..?

సూపర్ డూపర్ హిట్.. సూపర్ హిట్.. హిట్.. ఎబోవ్ యావరేజ్.. యావరేజ్.. బిలో యావరేజ్ ఫ్లాప్.. అట్టర్ ఫ్లాప్.. సినిమాల ఫలితాల్ని బట్టి ఇలా కేటగిరీలుండేవి ఒకప్పుడు. ఆ తర్వాత బ్లాక్‌బస్టర్, డిజాస్టర్ అనే కొత్త పదాలు వచ్చాయి. సూపర్ డూపర్ హిట్ బదులు బ్లాక్‌బస్టర్ అని, అట్టర్ ఫ్లాప్ బదులు డిజాస్టర్ అని అంటున్నారు. ఐతే కాల క్రమంలో ఈ కేటగిరీల్లో కొన్ని ఎగిరిపోతున్నాయి.

టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోతుండటంతో యావరేజ్, బిలో యావరేజ్, ఎబోవ్ యావరేజ్ లాంటి మాటలు వినిపించడం లేదు. సినిమాలు అయితే హిట్టవుతున్నాయి. లేదంటే ఫ్లాప్ అవుతున్నాయి. మధ్య రకంగా ఉండట్లేదు. ముఖ్యంగా కరోనా విరామానాంతరం రిలీజవుతున్న సినిమాల ఫలితాలు చూస్తే.. కొన్ని సినిమాలకు అనూహ్యమైన వసూళ్లు వస్తున్నాయి. వాటి స్థాయికి మించి అవి ఆడేసి బ్లాక్‌బస్టర్లు అయిపోతున్నాయి. కొన్ని సినిమాలేమో పర్వాలేదనే టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టర్ అవుతున్నాయి.

లాక్ డౌన్ తర్వాత తెలుగులో రిలీజైన తొలి పేరున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ కంటెంట్ పరంగా చూస్తే ఏమంత గొప్పగా ఉండదు. కానీ టాలీవుడ్ రీస్టార్ట్ మూవీగా దానికి మంచి హైప్ రావడంతో అది మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం. దాన్నొక స్పెషల్ మూవీగా పరిగణించి పక్కన పెట్టొచ్చు. ఇక సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’.. ప్రేమికుల దినోత్సవ వారాంతంలో వచ్చిన ‘ఉప్పెన’.. గత వారం విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాల విషయానికి వస్తే.. అవి వాటి స్థాయికి మించి వసూళ్లు అందుకున్నాయి. డబుల్ బ్లాక్‌బస్టర్ రేంజ్ అందుకునే రేంజ్ అయితే కాదు ఆ సినిమాలవి.

ప్రేక్షకులు అందుబాటులో ఉన్న సినిమాల్లో ఏది బెటర్ అని చూసుకుని దానికి పట్టం కట్టేస్తున్నారు. విరగబడి చూసేస్తున్నారు. అందుకే పై మూడు చిత్రాలకూ ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు వచ్చాయి. అదే సమయంలో టాక్ పరంగా ఓకే అనిపించుకున్న శ్రీకారం, ఎ1 ఎక్స్‌ప్రెస్ లాంటి సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరాభవం తప్పలేదు. షాదీ ముబారక్‌ విషయం ఉన్న సినిమానే అయినప్పటికీ.. దాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. ‘జాంబి రెడ్డి’, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలకు టాక్ ఏమంత బాగా లేదు. కానీ ఆయా వారాల్లో ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ సినిమాలయ్యాయి. దీంతో వాటికి మంచి ఫలితం దక్కింది. ఇలా కరోనా బ్రేక్ తర్వాత ఏ సినిమా ఎలా ఆడుతుందో చెప్పలేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది.

This post was last modified on March 17, 2021 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago