నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఆశ్చర్యంగా చూసిన వాళ్లే ఎక్కువ. ఇతనేంటి దర్శకుడేంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ అతను చాలా తక్కువ బడ్జెట్లో, ఎన్నో పరిమితుల మధ్య ‘చి ల సౌ’ లాంటి మంచి సినిమాను అందించి ఆశ్చర్యపరిచాడు. ఓ తొలి చిత్ర దర్శకుడు ఇంత బాగా సినిమా తీయడం అందరికీ పెద్ద షాక్. పైగా ఓ నటుడు దర్శకుడిగా మారి ఇలాంటి ఔట్ పుట్ ఇవ్వడమూ ఆశ్చర్యమే.
ఐతే తొలి సినిమాతో తనపై భారీగా పెరిగిన అంచనాలను రెండో సినిమాతో రాహుల్ అందుకోలేకపోయాడు. అక్కినేని నాగార్జున లాంటి పెద్ద హీరోతో సినిమా చేసే అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘మన్మథుడు-2’ లాంటి డిజాస్టర్ అందించాడు. దీంతో రాహుల్‌పై పెరిగిన అంచనాలన్నీ తలకిందులు అయిపోయాయి. అతడి కెరీర్ డోలాయమానంలో పడిపోయింది.
‘మన్మథుడు-2’ రిలీజై ఏడాదిన్నర దాటిపోగా రాహుల్ ఇప్పటికీ తన తర్వాతి సినిమాను ప్రకటించలేకపోయాడు. అతను నటుడిగా కూడా సినిమాలేమీ చేస్తున్నట్లు కనిపించడం లేదు. మరి దర్శకుడిగా అతడికి అవకాశం ఇచ్చేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఐతే టాలీవుడ్లో బిజీయెస్ట్ బేనర్లలో ఒకటైన గీతా ఆర్ట్స్ అతడితో సినిమా తీయడానికి రెడీ అయినట్లు సమాచారం బయటికి వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ చెప్పిన ఒక లేడీ ఓరియెంటెడ్ కథకు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆమోద ముద్ర వేశారు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. వచ్చే ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాహుల్‌తో జీఏ-2 బేనర్లో సినిమా రాబోతోందని బన్నీ వాసు స్వయంగా ధ్రువీకరించాడు. మరి రాహుల్ కథలో లీడ్ రోల్ చేయబోయే హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరం. రెండో సినిమా తరహాలో నేల విడిచి సాము చేయకుండా తన పరిధిలో రాహుల్ మంచి సినిమా అందిస్తాడని ఆశిద్దాం.
This post was last modified on March 17, 2021 3:57 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…