Movie News

కాజల్‌ పెళ్లికి ముందు ఏం జరిగింది?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఉన్నట్లుండి పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె కెరీర్ ఒకప్పటంత జోరుగా లేకపోయినా.. తనకు అవకాశాలకైతే కొదవలేదు. చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇంకా కొన్నేళ్లు కథానాయికగా కొనసాగడానికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా ఆమె వేరే స్టార్ హీరోయిన్లతో పోలిస్తే కొంచెం త్వరగానే పెళ్లి పీటలు ఎక్కేసింది. తన స్నేహితుడైన గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఐతే కొన్ని నెలల ముందు వరకు ప్రేమ-పెళ్లి గురించి ఎలాంటి సంకేతాలూ ఇవ్వకుండా సడెన్‌గా పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరి హఠాత్తుగా కాజల్ ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది.. గౌతమ్‌తో అంతకుముందు ఆమె ముందు ఎలాంటి అనుబంధం ఉండేది.. తనతో పెళ్లికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఈ ప్రశ్నలకు ‘మోసగాళ్ళు’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పింది కాజల్. ఇంతకీ ఆమె ఏమందంటే..?

‘‘గౌతమ్‌తో నా ప్రేమ వ్యవహారం గురించి పూర్తిగా చెబితే అదొక సినిమా కథ అవుతుంది. నేను, గౌతమ్ మంచి స్నేహితులం. పదేళ్లుగా మేం ఒకరికి ఒకరం తెలుసు. కానీ మేం ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. లాక్ డౌన్ టైంలో మా స్నేహం ఇంకొంచెం బలపడింది. ఆ టైంలో నీతో జీవితాంతం ఎవరు తోడుంటే బాగుంటుంది అనే ప్రశ్న ఒకరికి ఒకరం వేసుకున్నాం. అప్పుడు ఒకరికొకరు కనిపించాం. అప్పుడే మేమిద్దరం కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాం. వెంటనే గౌతమ్ వచ్చి మా నాన్నతో మాట్లాడారు. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఒక రకంగా మాది లాక్ డౌన్ పెళ్లి అన్నమాట. ఇప్పుడు మా ఇద్దరినీ చూసి నాన్న చాలా సంతోషిస్తున్నారు. పెళ్లి తర్వాత జీవితంలో పెద్ద మార్పులేమీ లేవు. కానీ వైవాహిక జీవితం కొత్త అనుభూతిని ఇస్తోంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉద్యోగాలు, ఇతరత్రా పనులు చేసే మహిళల మీద ఇంకా గౌరవం పెరిగింది’’ అని కాజల్ వివరించింది. పెళ్లి తర్వాత కాజల్ నుంచి వస్తున్న ‘మోసగాళ్ళు’ ఈ శుక్రవారమే రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on March 17, 2021 2:07 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

8 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

1 hour ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

1 hour ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago