షూటింగ్ పూర్తి చేసుకున్నాక కొన్ని నెలల పాటు వార్తల్లో లేకుండా పోయిన అక్కినేని నాగార్జున సినిమా వైల్డ్ డాగ్ ఈ మధ్యే మళ్లీ జనాల దృష్టిలో పడింది. ముందు ఈ సినిమాను ఓటీటీలో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న నిర్మాతలు.. తర్వాత మనసు మార్చుకుని ఏప్రిల్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి నిర్ణయిస్తూ ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే.
కొన్ని రోజుల కిందటే వైల్డ్ డాగ్ థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. దానికి మంచి స్పందనే వస్తోంది. ట్రైలర్లో కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. అలాగే విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనదగ్గ తమన్ ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు. ఐతే ముందు ఈ సినిమాకు తమన్‌ను సంగీత దర్శకుడిగా అనుకోలేదట. సినిమా పూర్తయ్యాక అతణ్ని అడిగారట.
తనకు ఖాళీ లేకపోయినా నాగ్ అడిగాడని తమన్ ఒప్పుకుని చాలా తక్కువ సమయంలో ఈ సినిమాకు ఔట్ పుట్ ఇచ్చాడట. వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో భాగంగా నాగ్ ఈ విషయం వెల్లడించాడు. టాకీ పార్ట్ అంతా అయ్యాక తమన్‌ను మ్యూజిక్ చేయమని అడిగామని, అతడికి అసలేమాత్రం ఖాళీ లేదని.. అయినా తన కోసం ఒప్పుకున్నాడని నాగ్ చెప్పాడు.
టైం లేకపోయినా కూడా క్వాలిటీ విషయంలో తమన్ రాజీ పడలేదని.. ఒకటికి మూడు రకాల ట్రాక్స్ ఇచ్చాడని.. తాము సంతృప్తి అయ్యే వరకు పని చేస్తూనే ఉన్నాడని నాగ్ చెప్పాడు. సినిమాకు రీరికార్డింగ్ ఎంతో ముఖ్యమని.. అందులోనూ తమన్ టాప్ క్లాస్ ఔట్‌పుట్ ఇచ్చాడని, సినిమాకు ఆర్ఆర్ మేజర్ హైలైట్ అవుతుందని నాగ్ ధీమా వ్యక్తం చేశాడు. మహర్షి రచయిత సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. నాగ్ ఇందులో ఎన్ఐఏ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
This post was last modified on March 16, 2021 12:28 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…