హీరోగా కెరీర్ ఆరంభించి.. బాహుబలితో విలన్ పాత్రకు మారి.. మధ్యలో కొన్ని స్పెషల్ క్యారెక్టర్లు కూడా చేసి తన కెరీర్‌ను భలేగా చక్కదిద్దుకున్నాడు దగ్గుబాటి రానా. వివిధ భాషల్లో పేరున్న దర్శకులు అతణ్ని దృష్టిలో ఉంచుకుని భిన్నమైన పాత్రలు రాస్తున్నారు.
వాటిలోంచి తన ఇమేజ్‌ను పెంచే ప్రత్యేక పాత్రల్ని ఎంచుకుని సాగిపోతున్నాడు రానా. మధ్యలో ఆరోగ్య సమస్యల వల్ల రానా కొంచెం స్లో అయ్యాడు కానీ.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాడు. కరోనా ప్రభావం లేకుంటే అతడి కొత్త సినిమా అరణ్య ఈపాటికి రిలీజ్ కావాల్సింది.
విరాటపర్వం కూడా విడుదలకు సిద్ధం కావాల్సింది. కానీ రెంటికీ బ్రేక్ పడిపోయాయి. ఈ ఖాళీ సమయంలో కథలు వింటూ కొత్త ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు రానా. అతడి ముందుకు ఒక ఆసక్తికర రీమేక్ వచ్చింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇటీవలే మలయాళ హిట్ అయ్యప్పనుం కోషియనుం రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో పృథ్వీరాజ్ చేసిన పాత్ర కోసం రానాను ఫైనలైజ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఐతే తాను ఈ సినిమా ఒప్పుకోవడానికి రానా ఓ కండిషన్ పెట్టాడట. తన తండ్రి సురేష్ బాబును ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా చేర్చాలని.. పారితోషకం కాకుండా సినిమాలో వాటా తీసుకుంటానని చెప్పాడని సమాచారం.
సురేష్ వాళ్లతో కలిస్తే డిస్ట్రిబ్యూషన్లో కూడా కలిసొస్తుందని భావించి వంశీ ఈ డీల్‌కు ఓకే అన్నట్లు తెలుస్తోంది. సినిమాలో మరో హీరో పాత్రకు నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. ఐతే ఆయన ఓకే అన్నాడో లేదో.. అసలు ఈ ప్రపోజల్ ఆయన వరకు వెళ్లిందో లేదో తెలియదు. బాలయ్య కాకపోతే ఎవరో ఒక సీనియర్ హీరోనే ఈ పాత్రను చేయాల్సి ఉంటుంది.
This post was last modified on April 9, 2020 6:27 pm
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న బ్రహ్మ ఆనందం ప్రమోషన్ల పరంగా అన్ని చేస్తున్నా ఒక బలమైన పుష్ కోసం ఎదురు…
కెరీర్ ఎప్పుడో మొదలైనా, ఎన్నో హిట్లు చూసినా వంద కోట్ల క్లబ్ అందని ద్రాక్షగా నిలిచిన నాగచైతన్యకు అది తండేల్…
దివంగత అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన అజరామరమైన పాత్రల్లో తెనాలి రామకృష్ణ చాలా ముఖ్యమైంది. ఎన్టీఆర్ అంతటి దిగ్గజం శ్రీకృష్ణ…
వాలెంటైన్ వీక్ సందర్భంగా ఎక్కడ చూసినా ఎన్నో రకాల గులాబీలు.. వాటి సుగందాలు మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. గులాబీ పువ్వు…