మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’ వేసవి కానుకగా మే 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది కొరటాల శివ. ఈ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు తెలుగు రాష్ట్రాల అవతల కూడా క్రేజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి ఓ భారీ హిందీ చిత్రం నుంచి పోటీ ఎదురు కాబోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రం ‘రాధె’ను కూడా మే 13నే విడుదల చేయాలని నిర్ణయించాడు.
‘రాధె’ చిత్రం రంజాన్ కానుకగా విడుదలవుతుందని సల్మాన్ ఇంతకుముందే ప్రకటించాడు. ఇప్పుడు డేట్ కూడా ఇచ్చేశాడు. చిరుతో సల్మాన్‌కు మంచి స్నేహమే ఉంది కానీ.. పోటీ మాత్రం అనివార్యమైంది. చిరు సినిమాకు ఉత్తరాదిన ‘రాధె’ వల్ల కొంచెం డెంట్ పడొచ్చు. అలాగే సల్మాన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో చిరు సినిమా గండి కొట్టే అవకాశముంది. ఐతే రెండూ వేర్వేరు భాషా చిత్రాలు.. ఒక సినిమా వల్ల ఇంకో సినిమాకు జరిగే నష్టం తక్కువ కావడంతో ఈ పోటీ గురించి చిరు, సల్మాన్ ఆలోచించే పరిస్థితి లేదు.
ఇక ‘రాధె’ విషయానికి వస్తే.. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ నటిస్తున్న మూడో చిత్రమిది. వీరి కలయికలో ‘పోకిరి’కి రీమేక్‌గా వచ్చిన తొలి సినిమా ‘వాంటెడ్’ బ్లాక్‌బస్టర్ అయింది. సల్మాన్ వరుస ఫ్లాపుల నుంచి బయటపడి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది ఈ సినిమాతోనే. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. సల్మాన్-ప్రభుదేవా కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘దబంగ్-3’ సరిగా ఆడలేదు. అయినా సరే.. ఈ దర్శకుడితో వెంటనే ‘రాధె’ చేశాడు. ‘మోస్ట్ వాంటెడ్ భాయ్’ అంటూ ఒక ఆసక్తికర క్యాప్షన్ జోడించారీ చిత్రానికి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సంస్థతో పాటు జీ స్టూడియోస్ ఉమ్మడిగా నిర్మించాయి.
This post was last modified on March 13, 2021 2:00 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…