‘లాభం’ అని ఒక తమిళ సినిమా. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంత కాలంగా చాలా బిజీగా ఉన్నాడు దాని దర్శకుడు జననాథన్. ఆ పని పూర్తి కావస్తుండగా ఉన్నట్లుండి తీవ్ర అనారోగ్యం పాలై.. ఇప్పుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్లు, ప్రాణాలతో పోరాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామం తమిళ సినీ పరిశ్రమను ఆందోళనలోకి నెట్టింది.
జననాథన్ జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు. 2003లో ఆయన సినిమా ‘ఇయర్కై’ ఆ సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. 61 ఏళ్ల జననాథన్ ఇప్పటిదాకా తమిళంలో నాలుగు సినిమాలు రూపొందించాడు. లాభంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. శ్రుతి హాసన్ హీరోయిన్. మన జగపతిబాబు విలన్ పాత్రలో నటించాడు. వ్యవసాయంలో దళారుల దందా నేపథ్యంలో నడిచే కథ ఇది. లాక్ డౌన్ టైంలో బ్రేక్ పడ్డ ఈ సినిమాను.. తర్వాత పూర్తి చేశారు. ఇప్పటికే ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. అది ఆకట్టుకుంది. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
కాగా కొన్ని రోజులుగా జననాథన్ రేయింబవళ్లు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. గురువారం ఉదయం జననాథన్ ఎడిటింగ్ పనులను పర్యవేక్షించి భోజనం కోసం ఇంటికి వెళ్లారు. తర్వాత తిరిగి రాలేదు. ఫోన్ చేసినా స్పందించలేదు. ఆయన కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు వెళ్లగా.. ఆయన స్పృహ లేకుండా పడి ఉండటం గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. జననాథన్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
This post was last modified on March 13, 2021 1:46 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…