Movie News

కార్తికేయతో సుకుమార్ సినిమా

ఒక సినిమా ఆడియో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక అనుకోని అతిథి కనిపించాడు అంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారితో తర్వాత ఆ వ్యక్తికి ఏదో ఒక భాగస్వామ్యం ఉండబోతోందని సంకేతాలు అందుతున్నట్లే. చాలా కొత్త కాంబినేషన్లు ఇలాగే బయటికి వస్తుంటాయి. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.

ఎందుకంటే అది తమ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కిన సినిమా కాబట్టి.. బన్నీ వచ్చి ప్రమోట్ చేయడం సహజమే. కానీ అదే వేడుకలో దర్శకుడు సుకుమార్ కనిపించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ‘పుష్ప’ పనుల్లో తీరిక లేకుండా ఉన్న ఆయన.. ఇక్కడికి ఎలా వచ్చాడని చాలామంది సందేహించారు. బన్నీ, అరవింద్ అడిగితే వచ్చాడా.. లేదా ఇంకేదైనా కారణం ఉందా అన్న చర్చ జరిగింది. ఐతే వేరే కారణంతోనే ఆ వేడుకకు సుక్కు వచ్చాడని ఇప్పుడు స్పష్టమైంది.

కార్తికేయతో సినిమా తీయడానికి సుకుమార్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఐతే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు కాదు కానీ.. ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోంది. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్న సినిమాలో కార్తికేయ హీరోగా నటించబోతున్నట్లు శుక్రవారం ప్రెస్ నోట్ బయటికి వచ్చింది. ‘సుకుమార్ రైటింగ్స్’ బేనర్ మీద ఈ సినిమా తెరకెక్కనుంది. అంటే ‘కుమారి 21 ఎఫ్’ మాదిరే ఈ చిత్రానికి కూడా సుక్కు అన్నీ తానై వ్యవహరించనున్నాడన్నమాట. ఎవరో ఒక సుకుమార్ శిష్యుడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశముంది. ఆ వ్యక్తి ఎవరో ఇంకా వెల్లడించలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకే విశేషాలు, వివరాలు కూడా బయటికి రాలేదు. జస్ట్ సుకుమార్ స్క్రిప్టుతో కార్తికేయ సినిమా అనేది మాత్రమే వెల్లడైంది. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్టుతో యువ కథానాయకుడు నిఖిల్ ప్రధాన పాత్రలో ‘18 పేజెస్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు.

This post was last modified on March 12, 2021 3:03 pm

Share

Recent Posts

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

56 minutes ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

1 hour ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

6 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

8 hours ago

పవన్ మాటల్లో ఆవేశం ఎందుకు తగ్గింది

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…

10 hours ago

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

11 hours ago