Movie News

‘శ్రీకారం’ కోసం ప్రభుత్వానికి హరీష్ శంకర్ రిక్వెస్ట్

‘శ్రీకారం’ సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ చిత్రాన్ని నిర్మించిన ‘14 రీల్స్ ప్లస్’ సంస్థతో మాత్రం మంచి అనుబంధం ఉంది. ‘14 రీల్స్’ నుంచి బయటికి వచ్చి రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట ‘14 రీల్స్ ప్లస్’ సంస్థ పెట్టాక అందులో తొలి సినిమాగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్’కు దర్శకుడు హరీషే. ఈ ఈ అనుబంధంతోనే ‘శ్రీకారం’ సినిమాను రిలీజ్‌కు కొన్ని రోజుల ముందే హరీష్ శంకర్ చూసేశాడట.

‘శ్రీకారం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ సినిమా చాలా గొప్పగా ఉందని కితాబిచ్చాడు హరీష్. అన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది.. ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అని తాను చెప్పను అని.. కానీ ‘శ్రీకారం’ చాలా నిజాయితీగా తీసిన మంచి ప్రయత్నం అని.. కోట్ల మంది హృదయాలను ఇది తడుతుందని హరీష్ కొనియాడాడు. ఈ సినిమా చూస్తూ ఏడెనిమిది చోట్ల తాను ఏడ్చేశానని.. సాయిమాధవ్ బుర్రా అద్భుతమైన డైలాగులు రాశాడని.. అవి నేరుగా గుండెల్ని తాకుతాయని హరీష్ చెప్పాడు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కేటీఆర్‌కు హరీష్ ఒక విజ్ఞప్తి కూడా చేశాడు. రైతుల గురించి, వ్యవసాయం గురించి ఈ సినిమాలో చాలా గొప్పగా చెప్పారని.. ఇది సమాజానికి ఉపయోగపడే సినిమా అని.. దీనికి ప్రభుత్వం విధించే వినోద పన్నును మినహాయించాలని హరీష్ కోరాడు. ఈ సినిమా చూశాను కాబట్టి ఇది ఆ కేటగిరి కిందికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని.. కేటీఆర్ కూడా ఈ చిత్రాన్ని చూసి దీనికి ఆ అర్హత ఉంది అనిపిస్తే వినోద పన్ను మినహాయించే అవకాశాన్ని పరిశీలించాలని కోరాడు.

పన్ను మినహాయింపు వస్తే నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని.. కానీ టికెట్ల ధరలు తగ్గి సినిమాకు రీచ్ పెరుగుతుందన్నదే తన అభిమతం అని హరీష్ అన్నాడు. ఇక కేటీఆర్ గురించి మాట్లాడుతూ.. బయట అయినా, సోషల్ మీడియాలో అయినా సమస్య అని ఆయన దృష్టికి వస్తే వెంటనే స్పందించి పరిష్కరించే తీరు ఆయన్ని గొప్ప నాయకుడిని చేసిందన్నాడు. ట్విట్టర్లో ఆయన టైం లైన్ చూస్తే.. ఇలా సమస్యల గురించి స్పందించిన ట్వీట్లే చాలా కనిపిస్తాయని హరీష్ అన్నాడు.

This post was last modified on March 10, 2021 2:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

31 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago