సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో మూవీ అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ‘ఆర్య’తో బన్నీకి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సుకుమార్, ‘ఆర్య 2’తో తనలోని నటుడిని నూటికి నూరు శాతం వాడుకున్నాడు. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టుగానే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అదరగొట్టారు.
‘పుష్ప’ అనే డిఫరెంట్ టైటిల్‌ను కన్ఫార్మ్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో బన్నీ గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే ఓ లారీ డ్రైవర్‌గా ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడని పోస్టర్‌లోనే రివిల్ చేసింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే ‘రంగస్థలం’తో నాన్-బాహుబలి హిట్టు కొట్టిన లెక్కల మాస్టర్, బన్నీ కోసం ఇలాంటి కథతోనే పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్టే తెలుస్తోంది.
స్టైలిష్ స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప’ను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు. అల్లు అర్జున్‌కు మాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయినా సినిమాలు కూడా మలయాళంలో సూపర్ హిట్ వసూళ్లను సాధించాయి. అలాగే ‘వరుడు’ సినిమా నుంచే బన్నీకి తమిళనాడులోనూ ఫాలోయింగ్ ఉంది. ‘డీజే’, ‘సరైనోడు’ వంటి సినిమాల హిందీ డబ్బింగ్ వెర్షన్‌లకు యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ వచ్చాయి. దాంతో ఈజీగా బాలీవుడ్‌లోనూ మంచి ఓపెనింగ్స్ తేవచ్చు.
ఇక సుక్కూ సనిమాల్లో కంటెంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ‘పుష్ప’కు ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే, కచ్ఛితంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్టుల్లో ఒకటిగా నిలుస్తుంది. సో… తమ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే సుకుమార్ అండ్ టీమ్ పర్ఫెక్ట్ స్కెచ్‌తో భారీగా ప్లాన్ చేస్తోంది.
This post was last modified on April 9, 2020 6:24 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…