‘బాహుబలి’ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ కొత్త చిత్రం ‘సాహో’ డిజాస్టర్ అయింది. ఐతేనేం పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ క్రేజ్ ఏమీ తగ్గిపోలేదు. అతడితో సినిమాలు చేయడానికి బాలీవుడ్లో అగ్ర దర్శకులు, బడా నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ‘ఆదిపురుష్’తో నేరుగా బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నాడు. ఓం రౌత్ లాంటి క్రేజీ డైరెక్టర్, భూషణ్ కుమార్ లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమా కోసం చేతులు కలిపారు.
మరోవైపు కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి అగ్ర నిర్మాతలు ప్రభాస్‌తో సినిమా చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వీరిలో ఆదిత్య.. ప్రభాస్ నుంచి కమిట్మెంట్ తీసుకున్నాడని, ఒక సంచలన మల్టీస్టారర్ మూవీకి అతను రంగం సిద్ధం చేస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ 24వ సినిమాగా తెరకెక్కబోయే ఆ చిత్రం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఒక భారీ మల్టీస్టారర్ తీయడానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు సమాచారం. ఇంతకుముందు హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ కలయికలో ‘వార్’ లాంటి భారీ చిత్రం తీసిన సిద్దార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. టైగర్ స్థాయి తక్కువ అయినప్పటికీ ‘వార్’ బ్లాక్‌బస్టర్ అయింది. అలాంటిది హృతిక్ రోషన్ ఎదురుగా ప్రభాస్ ఉంటే.. వీరితో సిద్దార్థ్ మార్కు యాక్షన్ ఎంటర్టైనర్ తీస్తే ఎలా ఉంటుందన్న ఊహే ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. ప్రస్తుతం సిద్దార్థ్.. షారుఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు.
ఆ సినిమా తర్వాత ఈ దర్శకుడి స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్‌తో చేయబోయే సినిమాలతో ప్రభాస్ రేంజ్ కూడా ఇంకా పెరగడం ఖాయం. హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఉన్న పేరుకు ఆ సంస్థ స్థాయికి తగ్గట్లు సినిమా తీస్తే ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలైపోవడం ఖాయం.
This post was last modified on March 9, 2021 8:35 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…