రాఘవేంద్రరావు టాలీవుడ్లో ఎంత పెద్ద కమర్షియల్ డైరెక్టరో.. ఆయన ఎలాంటి బ్లాక్ బస్టర్లు అందించారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఏ దర్శకుడికైనా మధ్యలో ఒక లీన్ ఫేజ్ ఉంటుంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడతాడు. అందులోనూ ఇప్పటి దర్శకుల్లా ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా చేయలేదు ఆయన. 30 ఏళ్ల వ్యవధిలో వంద సినిమాలు తీశారంటే ఎంత వేగం చూపించారో అర్థం చేసుకోవచ్చు.
ఆయన కూడా మధ్య మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడ్డారు. మంచి ఫాంలో ఉండగా ఆయన బాగా స్ట్రగులైన ఫేజ్ అంటే 1988-90 మధ్యే. మెగాస్టార్ చిరంజీవితో చేసిన యుద్ధభూమి, రుద్రనేత్ర సినిమాలతో పాటు నాగార్జునతో తీసిన అగ్ని, వెంకటేష్ హీరోగా తెరకెక్కించిన ఒంటరి పోరాటం ఫ్లాప్ అయ్యాయి. దీంతో రాఘవేంద్రరావు పనైపోయిందన్న కామెంట్లు వినిపించాయి.
అలాంటి సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు సన్నాహాలు మొదలు పెట్టారు నిర్మాత అశ్వినీదత్. అప్పుడు దర్శకేంద్రుడి ఫామ్ చూసి.. ఆయనకు అవకాశమివ్వడమేంటి అని చాలామంది దత్‌ను వెనక్కి లాగారట. చిరంజీవితో వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చిన రాఘవేంద్రరావును ఎలా నమ్మారని ప్రశ్నించారట. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సినిమాను ఆయన మాత్రమే అందంగా తెరకెక్కించగలరని దత్ నమ్మారు.
చిరు కూడా ఆయనకే ఓటేశారు. తనపై వీళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకేంద్రుడు ఎంతమాత్రం వమ్ము చేయలేదు. కెరీర్ తొలి రోజుల్లో తనేంటో రుజువు చేయడానికి ఎలా కసితో పని చేశారో.. ఈ చిత్రానికి కూడా అంతే కష్టపడ్డారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో.. ఈ సినిమా ఫలితమేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చారిత్రక విజయాన్నందుకున్న ఈ సినిమా తర్వాత చిరు, రాఘవేంద్రరావు కలిసి ‘ఘరానా మొగుడు’ రూపంలో మరో ఇండస్ట్రీ హిట్ డెలివర్ చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on May 10, 2020 8:41 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…