Movie News

సమీక్ష- షాదీ ముబారక్

చిన్న తెర హీరో మొగలిరేకులు సాగర్ పెద్ద తెర మీదకు రావడం కోసం చేసిన ప్రయత్నమే షాదీ ముబారక్. మూడేళ్ల నుంచి ఈ సబ్జెక్ట్ ను నమ్మి, ఎలాగైనా ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలని తపన పడ్డాడు. ఈ సినిమా చూసి, దానికి తనదైన మార్పులు చేర్పులు చేసి, విడుదలకు సాయం చేసాడు నిర్మాత దిల్ రాజు. ఇలా ఇంతలా పట్టు వదలకుండా ప్రయత్నించారు అంటే అందులో విషయం అంతో ఇంతో వుండాలనే అనుకున్నారంతా. అలాంటి టైమ్ లో టీజర్ వచ్చి సినిమా మీద కాస్త ఆసక్తి కలిగింది.

ఆ ఆసక్తితోనే చూసిన వారిని నిరాశపర్చని సినిమా షాదీ ముబారక్. కొత్తతరం కొత్త ఆలోచనలతో, చిన్న పాయింట్ చుట్టూ రెండు గంటల కథను అల్లుకుని, ప్రేక్షకుడిని కూర్చో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి ఈ సినిమా కూడా ఓ ఉదాహరణ. కేవలం మూడు పెళ్లి చూపులు, వాటి మధ్య జరిగిన చిన్న ప్రేమాయణం వెరసి షాదీ ముబారక్.

ఇంతకీ ఈ షాదీ ముబారక్ కథేంటీ అంటే…ఆస్ట్రేలియా నుంచి ఒకే రోజు మూడు పెళ్లి చూపులు చూసి, ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలని వస్తాడు మాధవ్ (సాగర్), ఆ పెళ్లి చూపులు చూపించాల్సిన మ్యారేజ్ బ్యూరో యజమానికి చిన్న అస్వస్థత వస్తుంది. దాంతో తన కూతురు సత్యభామ (దృశ్య) కు ఆ పని అప్పగిస్తుంది. హీరో ను హీరోయిన్ మూడు పెళ్లి చూపులకు తనే తీసుకెళ్లడం దగ్గరే వైవిధ్యమైన పాయింట్ ను పట్టుకున్నాడు దర్శకుడు పద్మశ్రీ. ఆ మూడు పెళ్లి చూపులు మూడు రకాలు. ఒకె అనాలా వద్దా అనే సందిగ్దం. కానీ అదే సమయంలో కొన్ని గంటల పాటు తనతో కారులో ప్రయాణిస్తూ, పెళ్లి చూపులు చూపిస్తున్న సత్యభామపై మనసు పారేసుకుంటాడు. కానీ ఇలాంటి టైమ్ లో చిన్న ట్విస్ట్. దాంతో ఇద్దరి మధ్య కాస్త దూరం. ఆ తరువాత ఏమయింది అన్నది మిగిలిన సినిమా.

కేవలం చిన్న పాయింట్. తక్కువ మంది నటులు, సిటీలో కారులో తిరుగుతూ ఫన్ నడిపించడం ఇలాంటి వైవిధ్యమైన విషయంతో సినిమా తీసి మెప్పించడం అంత సులువు కాదు. కానీ దర్శకుడు పద్మశ్రీ తన రైటింగ్ తో మెప్పించాడు. మూడు పెళ్లి చూపులకు మూడు వైవిధ్యమైన కుటుంబాలు ఎంచుకోవడం, హీరో యంగ్ ఏజ్ లో సైట్ కొట్టిన అమ్మాయి ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లడం, తొలిసగం అంతా హీరోయిన్ చేత ఫన్ పండేలా డైలాగులు కురిపించడం వంటివి బాగా రాసుకున్నాడు.

తొలిసగం మొత్తం దర్శకుడు పూర్తిగా ప్రేక్షకులను మెప్పిస్తాడు. పెద్దగా విషయం ఏమీ లేకుండానే తొలిసగం మొత్తం కూర్చోపెట్టాడుగా అని అనిపిస్తాడు. తొలిసగంలో పెట్టాలని ఓ పాట ప్లేస్ చేసాడు కానీ లేకపోయినా ఫరవాలేదు.

కానీ మలిసగంలోకి వచ్చాక ఆ గ్రిప్ ను దర్శకుడు నిలబెట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా హీరో మీద కినిసి లేదా కోపంతో చటుక్కున మరో పెళ్లికి అర్జెంట్ గా ఓకె చెప్పండం, దానికి లింక్ చేస్తూ తీసుకుంటూ వచ్చిన సీన్లు అన్నీ అదనపు భారం అయిపోయాయి. నిజానికి ఇవన్నీ లేపేసినా ఫరవాలేదు. అలాగే హీరోయిన్ ఉంగరం మింగే సీన్ కూడా కాస్త అదనమే అనిపించింది. ఇలా కొన్ని అదనపు భారాల వల్ల సినిమా లాగ్ అనిపించింది. పైగా తొలిసగం బాగా మార్కులు కొట్టేయడం, ఆ లెవెల్ కు మలిసగం చేరుకోకపోవడం సినిమాకు మైనస్ అయింది.

సాగర్ హీరోగా ప్రయత్నించాడు కానీ శభాష్ అనిపించుకోలేదు. పైగా చాలా సీన్లలో డల్ అయ్యాడు. దృశ్య మాత్రం మరీ అద్భుతమైన హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా, క్యూట్ మూవ్ మెంట్స్, డైలాగ్స్ తో డామినేట్ చేసేసింది. సాక్షి రామ్ రెడ్డి తండ్రిగా బాగున్నాడు. ఇలా కంటిన్యూ అయిపోవచ్చు. మిగిలిన వారు ఓకె.

సినిమాకు బడ్జెట్ సమస్య కనిపించింది. పైగా కొన్ని సీన్లు రీషూట్ చేయడం, కొన్ని ఎప్పుడో తీసనవి కావడంతో, కలర్ తేడా అక్కడక్కడ కనిపించింది. బడ్జెట్ మరికాస్త వుంటే ఇలాంటివి అధిగమించవచ్చు. అలాగే కాస్త మంచి జూనియర్ ఆర్టిస్ట్ లను పెట్టుకోవచ్చు. నేపథ్యసంగీతం బాగుంది కానీ ఇలాంటి సినిమాకు కనీసం ఒక్కటన్నా మంచి పాట వుండాలి. ఆ లోటు అలాగే వుండిపోయింది.

మొత్తం మీద తొలి సినిమా అయినా దర్శకుడు పద్మశ్రీ కి విషయం వుందనిపించింది. కాంటెంపరరీ యూత్ కు ఈ వీకెండ్ మల్టీ ఫ్లెక్స్ ల్లో మంచి కాలక్షేపమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్లు

తొలిసగం ఫన్

హీరోయిన్

మైనస్ పాయింట్లు

మలిసగంలో అదనపు సీన్లు

ఫినిషింగ్ టచ్: షాదీ కి పెహ్లి దిన్

-సూర్య

This post was last modified on March 5, 2021 4:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

10 minutes ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

30 minutes ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

45 minutes ago

మోహన్ లాల్ సినిమా.. సౌండ్ లేదేంటి?

మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…

1 hour ago

బన్నీ గొడవ.. నేషనల్ మీడియాకు సీపీ క్షమాపణ!

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…

2 hours ago

మంచి ఛాన్స్ మిస్సయిన రాబిన్ హుడ్!

క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…

2 hours ago