నా పేరు సూర్య తర్వాత ఏడాదికి గ్యాప్ తీసుకుంటే తీసుకున్నాడు కానీ.. రీఎంట్రీలో అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించి అభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను సుకుమార్ దర్శకత్వంలో కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా పట్టాలెక్కబోతోందీ సినిమా. కరోనా ప్రభావం తగ్గాక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావచ్చు.
ఈ ఏడాది చివరికి ఈ చిత్రాన్ని బన్నీ పూర్తి చేసే అవకాశాలున్నాయి. దాని తర్వాత బన్నీ చేయబోయే సినిమా మీద రకరకాల ప్రచారాలు నడిచాయి. వేణు శ్రీరామ్‌తో ఐకాన్ మూవీని ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ దాన్ని ఇమ్మీడియట్‌గా అయితే బన్నీ మొదలుపెట్టేలా లేడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేసుగుర్రం సీక్వెల్ గురించి ప్రచారం జరిగింది కానీ.. బన్నీ ఇంకా కమిట్మెంట్ ఏమీ ఇవ్వలేదట. ప్రస్తుతానికి బన్నీ దృష్టి కొరటాల శివ మీద ఉన్నట్లు సమాచారం. తాను సుకుమార్ సినిమా పూర్తి చేసే సమయానికే కొరటాల ఆచార్య పూర్తి చేసి ఖాళీ అవుతాడు.
సామాజికాంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్లు తీసే కొరటాలతో సినిమా చేస్తే తన కెరీర్‌కు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఇంతకుముందే ఆయనతో సినిమా కోసం ప్రయత్నించాడు కానీ.. కాంబినేషన్ సెట్ కాలేదు.
ఇప్పుడు మెగా కాంపౌండ్లో అడుగు పెట్టిన ఆయనతో సినిమా కోసం బన్నీ ఆసక్తి ప్రదర్శిస్తున్నాడని.. కొరటాల ఓకే అంటే తర్వాతి సినిమాను గీతా ఆర్ట్స్ బేనర్లో ఆయనతోనే చేయొచ్చని అంటున్నారు. బుధవారం బన్నీ పుట్టిన రోజు నేపథ్యంలో కొత్త ప్రాజెక్టుల గురించి ఏమైనా ప్రకటిస్తారేమో చూడాలి.
This post was last modified on April 9, 2020 6:25 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…