దశాబ్దం వెనక్కి వెళ్తే.. దక్షిణాదిన ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఏ హీరో కూడా దరిదాపుల్లో ఉండేవాడు కాదు. ముఖ్యంగా ‘రోబో’ సినిమాతో ఆయన రేంజే మారిపోయింది. మార్కెట్ అసాధారణ స్థాయిలో విస్తరించింది. విజయ్, అజిత్ లాంటి తర్వాతి తరం బడా స్టార్ల మార్కెట్ రజినీతో పోలిస్తే చాలా తక్కువగా ఉండేది. కానీ తర్వాతి కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రజినీ వరుస డిజాస్టర్లతో డౌన్ అయిపోయాడు. విజయ్, అజిత్ వరుస బ్లాక్‌బస్టర్లతో ఆయనకు దగ్గరగా వచ్చేశారు.
ముఖ్యంగా విజయ్ జోరైతే మామూలుగా లేదు. అతను చేసేవి రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలే. కానీ అవే బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంటూ వచ్చాయి. చూస్తుండగానే అతను రజినీకాంత్‌కు దగ్గరగా వచ్చేశాడు. ఆయన్ని దాటి కూడా ముందుకెళ్లిపోయాడు. ప్రస్తుతం తమిళంలో ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్, సక్సెస్ రేట్ పరంగా విజయే నంబర్ వన్ హీరో.
ఈ సంక్రాంతికి 50 పర్సంట్ ఆక్యుపెన్సీతో రిలీజై, డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా విజయ్ చిత్రం ‘మాస్టర్’ రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం గమనార్హం. రజినీ చివరి సినిమా ‘దర్బార్’ అటు ఇటుగా వంద కోట్లు రాబట్టిందంతే. అంతకుముందు ఆయన్నుంచి వచ్చిన పేట సైతం సరిగా ఆడలేదు. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లూ ఇన్‌డైరెక్ట్‌గా సూపర్ స్టార్‌పై పైచేయి సాధిస్తూ వచ్చిన విజయ్.. ఈసారి ఆయన్ని నేరుగా ఢీకొట్టి తన ఆధిపత్యం చాటాలనుకుంటున్నాడు.
విజయ్‌కి దీపావళికి సినిమాలు రిలీజ్ చేయడం అలవాటు. చాలా ఏళ్లుగా ఆ పండక్కి సినిమాలు వదులుతున్నాడు. ఐతే గత ఏడాది కరోనా కారణంగా లెక్క తప్పింది. ఈసారి దీపావళికి విజయ్ కంటే ముందు రజినీ తన ‘అన్నాత్తె’ సినిమాను రేసులో నిలబెట్టేశాడు. రజినీ మీద గౌరవంతో అయినా విజయ్.. దీపావళికి దూరంగా ఉంటాడనుకున్నారు. కానీ అతనేమో దిలీప్ నెల్సన్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే సినిమాను దీపావళికే రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడట. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. రజినీని నేరుగా ఢీకొట్టి పైచేయి సాధించడం ద్వారా ఆయన్ని తాను దాటేశానని రుజువు చేయాలన్నది విజయ్ ఆలోచనేమో.
This post was last modified on March 4, 2021 2:57 pm
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…