ఓ వైపు డేట్ దగ్గర పడుతోంది. మరోవైపు తాము కోరుకుంటున్న అప్ డేట్ విషయంలో ఏ చప్పుడూ లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం నుంచి అతడికి, అభిమానులకు కానుక ఉంటుందా లేదా అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి నెలాఖర్లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ చేసిన వీడియో ఎంత బాగా పేలిందో తెలిసిందే.
అదే స్థాయిలో జూనియర్ పుట్టిన రోజుకూ వీడియో తప్పక ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ కంటెంట్ పేపర్ మీద రెడీగా ఉన్నా.. చిత్రీకరణకు అవకాశం లేకపోవడంతో తారక్ పుట్టిన రోజుకు స్పెషల్ వీడియో ఉంటుందో లేదో చెప్పలేమని రాజమౌళి ఇంతకుముందు సందేహాలు వ్యక్తం చేశాడు. అలాగని అసలేమీ ఉండదని కొట్టిపారేయనూ లేదు. ఇది తమకు సవాలే అని.. ఏం చేస్తామో చూడాలని అన్నాడు.
ఐతే అభిమానుల్లో అంచనాలు తగ్గించడానికి, రామ్ చరణ్ వీడియో స్థాయిలో తారక్ ఏవీని చేయడానికి అవకాశం లేదని చెప్పడానికి రాజమౌళి ఇలా డౌట్లు క్రియేట్ చేశాడేమో అనుకుంటున్నారు. తారక్ మీద జక్కన్నకున్న ప్రత్యేక అభిమానం తెలిసిందే కాబట్టి ఏదో ఒక విశేషాన్ని అయితే రెడీ చేయకుండా ఉండడనే భావిస్తున్నారు. మరి అదేంటన్న విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది.
ఒక దశలో వరుసగా ఇంటర్వ్యూలిచ్చిన జక్కన్న.. గత పది రోజులుగా సైలెంటుగా ఉన్నాడు. తారక్ వీడియోకు సంబంధించి అసలే విధమైన సౌండ్ లేదు. పుట్టిన రోజుకు ఇంకో పది రోజులే వ్యవధి ఉండగా.. ఆ రోజుకు ఏమీ లేకుండా జక్కన్న షాక్ ఇస్తాడా.. లేక ఏదో ఒక విశేషంతో సర్ప్రైజ్ చేస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on May 9, 2020 10:49 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…