దర్శక ధీరుడు రాజమౌళిది చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో ఆయన అభిమానించే వ్యక్తుల్లో గుణ్ణం గంగరాజు ఒకరు. ఆయన రాజమౌళికి చాలా దగ్గరి బంధువు. ఆయన్నుంచి తాను సినిమాకు సంబంధించి ఎన్నో గొప్ప పాఠాలు నేర్చుకున్నట్లు జక్కన్న చెబుతుంటాడు. ‘లిటిల్ సోల్జర్స్’ లాంటి అద్భుతమైన సినిమాను అందించిన దర్శక నిర్మాత ఆయన.
తర్వాత ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’తో పాటు ‘అమృతం’ లాంటి ఆల్ టైం క్లాసిక్ సీరియల్‌ను కూడా నిర్మించారు. ఈయన తనయుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా, రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఏడాది కిందట ‘ఆకాశవాణి’ అనే సినిమా ఒకటి మొదలైన సంగతి తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సముద్రఖని ఇందులో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఐతే అశ్విన్, కార్తికేయ చాలా ఉత్సాహంగా మొదలుపెట్టిన ఈ సినిమాకు మధ్యలో బ్రేక్ పడింది.
ఆరు నెలలుగా ‘ఆకాశవాణి’ గురించి ఏ అప్ డేట్ లేదు. సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది ఈ మధ్య. ఐతే ఇప్పుడు ఓ షాకింగ్ అప్ డేట్‌తో సినిమా వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమా నుంచి కార్తికేయ తప్పుకున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అశ్విన్ స్వయంగా వెల్లడించాడు. అనివార్య కారణాల వల్ల తాను, కార్తికేయ దూరం కావాల్సి వచ్చిందని.. ఇప్పటిదాకా కార్తికేయ అందించిన సపోర్ట్‌కు ధన్యవాదాలని ఓ ప్రకటన ఇచ్చాడతను.
ఏయూ అండ్ ఐ స్టూడియోస్ సంస్థ అధినేత పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని టేకప్ చేసినట్లు కూడా అతను వెల్లడించాడు. ‘ఆకాశవాణి’ చాలా పెద్ద డ్రీమ్ అని.. అదొక అందమైన కథతో తెరకెక్కుతున్న చిత్రమిదని.. కార్తికేయ తప్పుకోవడం తన టీంకు ఇబ్బందికర విషయమే అని.. అయినా ముందున్న స్ఫూర్తితోనే సినిమా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని.. ఈ సినిమా కోసం ఇంకొంత కాలం ఎదురు చూడాలని కోరాడు అశ్విన్.
This post was last modified on May 9, 2020 2:54 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…