Movie News

ముంబ‌యిలో ప్ర‌భాస్ భారీ పెట్టుబ‌డి

బాహుబ‌లి మూవీతో ఉత్త‌రాదిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మ‌న ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అనిపించుకున్న సాహో.. నార్త్‌లో హిట్ స్టేట‌స్ అందుకుందంటే అక్క‌డ అత‌డికి ఏ స్థాయిలో ఫాలోయింగ్ వ‌చ్చిందో, త‌న‌ను అక్కడి ప్రేక్ష‌కులు ఎలా నెత్తిన పెట్టుకున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. డిజాస్ట‌ర్ టాక్‌తోనూ ఈ సినిమా హిందీలో రూ.150 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ట్ చేయ‌డం విశేషం.

ఇది చూసే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌భాస్‌తో సినిమా చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అత‌డి ప్ర‌తి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెర‌కెక్కుతోంది. ఆదిపురుష్‌తో అత‌ను నేరుగా హిందీలో అడుగు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ది బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లూ అక్క‌డి వాళ్లే. ఒక ర‌కంగా చెప్పాలంటే అది హిందీలో తెర‌కెక్కి తెలుగులోకి అనువాదం కానున్న సినిమా అని చెప్పొచ్చు.

ఈ సినిమా అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌కు వెళ్ల‌నుంది. దాని కోసం కొన్ని నెల‌ల పాటు ప్ర‌భాస్ ముంబ‌యిలో ఉండాల్సి వ‌స్తుంది. ప్ర‌భాస్ చేస్తున్న, చేయ‌బోయే సినిమాల‌కు కూడా పాన్ ఇండియా అప్పీల్ రావ‌డం కోసం ముంబ‌యిలో చిత్రీక‌ర‌ణ జ‌రిపే అవ‌కాశ‌ముంది. త‌ర‌చుగా అత‌ను బాలీవుడ్ సినీ స్థావ‌రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ముంబ‌యిలో ఓ భారీ ఇల్లు కొనుక్కోవాల‌ని చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఆదిపురుష్ నిర్మాత‌ల్లో ఒక‌రైన భూషణ్ కుమార్‌తో ఈ విష‌య‌మై సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌. ప్ర‌భాస్‌కు ఇల్లు చూసే బాధ్యత ఆయ‌నే తీసుకున్నాడ‌ట‌.

ఎలాగూ ఒక పెట్టుబ‌డిగా కూడా ఉంటుంద‌న్న ఉద్దేశంతో ముంబ‌యిలోని ఖ‌రీదైన ప్రాంతంలో పెద్ద ఇల్లు కొనుక్కోవాల‌ని ప్ర‌భాస్ చూస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌దుల కోట్ల మొత్తంలోనే ఇందుకోసం పెట్టుబ‌డి పెడుతున్నాడ‌ట‌. బహుశా ఆదిపురుష్ సినిమాకు వ‌చ్చే పారితోష‌క‌మంతా ఇంటి మీదే పెట్టేస్తున్నాడేమో ప్ర‌భాస్.

This post was last modified on March 3, 2021 11:30 am

Share

Recent Posts

అందరూ బాధితులే… ఇంతకీ విలన్లెవరు?

ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…

1 hour ago

ఒంటరిగా యుద్ధ విమానం నడిపిన మహారాణి…

థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…

1 hour ago

డబ్బుల్లేక.. కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి!

కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…

2 hours ago

హౌతీల దాడితో మధ్యలోనే వెనుదిరిగిన ఎయిరిండియా ఫ్లైట్

యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…

2 hours ago

పెంచి పోషించిన గ్రోకే దెబ్బేసిందిగా మస్క్

భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…

3 hours ago

పెళ్లి పేరుతో బిగ్ బాస్ విన్నర్ మోసం?

తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…

3 hours ago