మెగాస్టార్ చిరంజీవి, తనకు ఏప్రిల్ 8తో ప్రత్యేక అనుబంధం ఉందని, అదేమిటో ఆరోజే చెబుతానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. దాంతో చిరూ ఏం చెబుతారా? ఆ రోజు స్పెషాలిటీ ఏమిటా? అని చాలా పెద్ద చర్చే జరిగింది. అసలు విషయం ఏమిటంటే మెగా వారసులు అల్లు అర్జున్, అకీరాలతో పాటు అఖిల్ పుట్టినరోజు నేడు. అలాగే నేడు మెగాస్టార్‌కు ఎంతో ఇష్టమైన హనుమాన్ జయంతి కూడా.
బన్నీ చిన్నప్పటి ఫోటోను పోస్ట్ చేసిన చిరూ ‘డ్యాన్స్‌లో గ్రేస్, ఆ వయసు నుంచే ఉంది. బన్నీలో కసి, కృషి నాకు చాలా ఇష్టం… నువ్వు బాగుండాలబ్బా…’ అంటూ బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే అక్కినేని వారసుడు అఖిల్‌కు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరూ. అఖిల్ చరణ్‌కి తమ్ముడు, మాకు ఓ కొడుకులా అంటూ అఖిల్, నాగ్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు మెగాస్టార్. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకీరాకు బర్త్ డే విషెస్ తెలిపారు మెగాస్టార్. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు. అన్ని విషయాల్లో కూడా ఇలాగే అందరినీ మించిపోవాలి’ అంటూ అకీరా హైట్‌ను గుర్తు చేశాడు చిరూ.
కరోనా లాక్ డౌన్ కారణంగా బర్త్ డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్న స్టార్ల ఫ్యాన్స్‌కు చిరూ తన ట్వీట్స్‌తో స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ఇకపోతే ఏప్రిల్ 8 తాలూకు స్పెషాలిటీ ఇదొక్కటే కాదు. ఈరోజు హనుమాన్ జయంత కూడా కావడంతో.. తనకూ హనుమంతునికి ఉన్న అనుబంధం చెప్పుకొచ్చారు మెగాస్టార్.
This post was last modified on April 9, 2020 6:24 pm
నిన్న విడుదలైన అన్ స్టాపబుల్ 4 ఎపిసోడ్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ కోసం రామ్…
వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి గురువారం సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ…
‘బాహుబలి: ది బిగినింగ్’కు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసినపుడు బాలీవుడ్ నుంచి మంచి సపోర్టే లభించింది. కరణ్ జోహార్…
తిరుమల తోపులాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై ఏపీలోని కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించింది. బుధవారం విశాఖ పర్యటనకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు… దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల…
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…