ఫారియా అబ్దుల్లా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న కొత్త అందం. జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా పరిచయం అవుతోందీ లోకల్ బ్యూటీ. చిట్టి నీ నవ్వంటే అంటూ నవీన్ పొలిశెట్టి మైమరిచిపోయి పాడేస్తుంటే.. ఈ అమ్మాయి అందం చూసి కుర్రాళ్లు కూడా అదే భావనలోకి వెళ్లిపోయారు. రెగ్యులర్ హీరోయిన్లకు భిన్నమైన అందం, హావభావాలతో ఈ అమ్మాయి ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించింది.
ఆరేళ్లకు పైగా థియేటర్ ఫీల్డ్‌లో అనుభవం సాధించి మరీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందీ అమ్మాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో పుట్టి పెరిగిన తనకు సినిమా అవకాశం అనుకోకుండా వచ్చిందని ఆమె వెల్లడించింది. జాతిరత్నాలు నిర్మాత అయిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ కాలేజీ వేడుకలో తనను చూసి ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపింది.
తాను హైదరాబాద్ లయోలా కాలేజీలో చదువుకున్నానని.. ఆ కాలేజీ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లినపుడు ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్‌కు కలిసి తనకున్న సినిమా ఆసక్తి గురించి చెప్పానని.. ఆ తర్వాత కొంత కాలానికి ఆయన పిలిచి ఆడిషన్ చేసి జాతిరత్నాలు సినిమాకు కథానాయికగా ఎంపిక చేశారని ఫారియా వెల్లడించింది. జాతిరత్నాలులో తన పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో నచ్చుతుందని, తనకీ సినిమా పెద్ద బ్రేక్ ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ సినిమా తర్వాత ఎవరితో నటించాలని ఆశిస్తున్నారు అని అడిగితే.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌కు తాను వీరాభిమానిని అని.. ఆయనతో నటించాలని ఉందని చెప్పిన ఫారియా.. తెలుగులో మాత్రం విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయాలన్నది తన కోరిక అని వెల్లడించింది. జాతిరత్నాలు ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 3, 2021 10:57 am
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…