జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పనిలో బిజీగా ఉంటే.. దాని తర్వాత అతను నటించే సినిమా కోసం మరోవైపు చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఇంకో మూడు నెలల్లోపే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 20న తారక్ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు కూడా అందుతున్నాయి.
ప్రి ప్రొడక్షన్ వర్క్ పనులు సాగిస్తూనే.. కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారట. అలాగే సినిమా రిలీజ్ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు రష్మిక మందన్నా కథానాయికగా ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎన్టీఆర్ జత కట్టనిది రష్మికతో మాత్రమే. ఆమె ప్రస్తుతం ఎలాంటి ఫాంలో ఉందో కూడా తెలిసిందే. సౌత్ ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న రష్మికను పెట్టుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఎంతో చలాకీగా నటించే రష్మికకు త్రివిక్రమ్ మార్కు క్యారెక్టర్ ఇస్తే భలేగా పేలుతుందనడంలో సందేహం లేదు.
ఇక ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ముందు నుంచి అనుకుంటున్నట్లే తమనే సంగీత దర్శకుడిగా ఖరారైనట్లు సమాచారం. వరుసగా త్రివిక్రమ్ మూడో సినిమాకు అతను సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ముందు 2022 సంక్రాంతినే టార్గెట్ చేశారు కానీ.. అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టం. పైగా ఆ సీజన్‌కు ఆల్రెడీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌ల సినిమాలు ఖరారయ్యాయి కాబట్టి వేసవికి ఈ చిత్రాన్ని షెడ్యూల్ చేయనున్నట్లు తెలిసింది.
This post was last modified on March 2, 2021 12:27 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…