ఇంతకుముందులా పరభాషా కథానాయికలు ఏదో వచ్చామా తెలుగులో సినిమా చేసి వెళ్లిపోయామా అన్నట్లు ఉండట్లేదు. మన భాష నేర్చేసుకుంటున్నారు. ఒకప్పటి హీరోయిన్లు ఎన్నేళ్లు తెలుగులో నటించినా ‘‘అందరికీ నమస్కారం.. బాగున్నారా’’ అంటూ వచ్చీ రాని తెలుగులో ఒకట్రెండు మాటలు మాట్లాడితే ఎక్కువ అన్నట్లుండేది. కానీ ఇప్పటి హీరోయిన్లు ఒకట్రెండు సినిమాలకే మన భాష మీద పట్టు సాధిస్తున్నారు.
సమంత, తమన్నా, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్, పూజా హెగ్డే, రష్మిక మందన్నా.. ఇలా చాలామంది పరభాషా కథానాయికలు తెలుగులో గలగలా మాట్లాడేసేవాళ్లే. వీరిలో సమంత, రష్మిక లాంటి వాళ్లు సౌత్ అమ్మాయిలు కాబట్టి తెలుగులో పట్టు సాధించడం సులువే అనుకోవచ్చు. కానీ ఢిల్లీ అమ్మాయి అయిన రకుల్ ప్రీత్ తెలుగులో ఎంతో స్పష్టంగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె మన వాళ్లనే కాదు.. బాలీవుడ్ వాళ్లకు సైతం తన తెలుగుతో షాకిస్తోందట.
తన వెంట ఉండే టీమ్ అంత తెలుగు వాళ్లే అని.. కాబట్టి ఎక్కడికి వెళ్లినా తాను తెలుగులో మాట్లాడక తప్పదని రకుల్ చెప్పింది. తన కొత్త చిత్రం ‘చెక్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి రకుల్.. తన తెలుగు నైపుణ్యం గురించి మాట్లాడింది. ముంబయిలో సైతం తాను తెలుగులోనే మాట్లాడతానని వెల్లడించింది. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నా సహాయకులు తెలుగు వాళ్లే. నేనెక్కడికి వెళ్లినా వాళ్లు నా తోడుగా ఉంటారు కాబట్టి తెలుగులో మాట్లాడక తప్పదు. ఈ మధ్య తాను హిందీలో చేస్తున్న ‘సర్దార్ కా గ్రాండ్ సన్’కు సంబంధించి ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తెలుగువాడే అయిన ఆ చిత్ర సినిమాటోగ్రాఫర్‌తో తెలుగులో మాట్లాడ్డం చూసి హీరో అర్జున్ కపూర్ ఆశ్చర్యపోయాడు. నా పేరులో ప్రీత్ సింగ్ అని లేకపోయి ఉంటే కచ్చితంగా అందరూ తెలుగమ్మాయే అనుకునేవారని అన్నాడు’’ అని రకుల్ వెల్లడించింది.
మరో లాక్ డౌన్ టైం తన జిమ్ వ్యాపారం దెబ్బ తిందని, అయినా సరే సిబ్బందికి జీతాలు ఆపలేదని, ఇప్పుడిప్పుడూ మళ్లీ బిజినెస్ ఊపందుకుంటోందని రకుల్ తెలిపింది.
This post was last modified on February 28, 2021 1:04 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…