సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ వచ్చే ఏడాది కార్యరూపం దాల్చబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి.. మహేష్ బాబుతో చేయబోయే సినిమా ఇప్పటికే ఖరారైంది. ఐతే ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నదానిపై స్పష్టత లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా మాత్రం ఇదే. కానీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి రాజమౌళి బయటికి రావడానికే ఇంకా ఏడెనిమిది నెలలు పట్టేలా ఉంది.
మిగతా దర్శకుల్లాగా ఒక సినిమా పూర్తయిన వెంటనే ఇంకోటి మొదలుపెట్టేసే రకం కాదు జక్కన్న. సినిమా సినిమాకూ తనపై పెరిగే అంచనాలు అందుకోవడం కోసం స్క్రిప్టు మీద చాలా సమయం వెచ్చిస్తాడు. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా ఆషామాషీగా జరగదు. ఈ నేపథ్యంలోనే 2022 ద్వితీయార్ధంలో కానీ తాను సినిమా మొదలుపెట్టలేనని మహేష్‌కు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడట జక్కన్న.
ఈ నేపథ్యంలో ‘సర్కారు వారి పాట’ అయ్యాక రాజమౌళి సినిమా మొదలుపెట్టడానికి ముందు ఒకటి లేదా రెండు సినిమాలు చేయొచ్చని మహేష్ భావిస్తున్నాడు. రెండో సినిమా సంగతేమో కానీ.. ఒక సినిమా అయితే మాత్రం పక్కాగా చేయబోతున్నాడు. దాన్ని ఖరారు చేసే పనిలో మహేష్ ప్రస్తుతం ఉన్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ దుబాయ్ షెడ్యూల్ ముగించుకుని కొంచెం గ్యాప్ తీసుకున్న మహేష్.. అందుబాటులో ఉన్న దర్శకుల నుంచి కథలు వినే పనిలో పడ్డాడట.
అతడితో ఇప్పటికే సినిమాలు చేసిన అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లిలు ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు మహేష్‌తో ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమా చేసిన అనిల్.. ఈసారి కొంచెం భిన్నమైన కథతో మహేష్‌ను కలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ తనతో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో నిరాశపడ్డ వంశీ పైడిపల్లి.. మరోసారి సూపర్ స్టార్‌ను మెప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వీళ్లిద్దరిలో ఒకరితో రాజమౌళి సినిమాకు ముందు మహేష్ కలిసి పని చేసే అవకాశముంది. అనిల్‌తోనే మూవీ ఖరారవ్వచ్చని అంటున్నారు.
This post was last modified on February 27, 2021 3:52 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…